ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో న్యూఢిల్లీలో నైజీరియా ఉపాధ్యక్షునితో ప్రధాని సమావేశం

నాడు పోస్టు చేయడమైనది: 13 SEP 2026 6:13PM by PIB Hyderabad

బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో న్యూఢిల్లీలో నైజీరియా ఫెడరల్ రిపబ్లిక్ ఉపాధ్యక్షులు జీసీవోఎన్ కాషిం షెట్టిమా ముస్తఫాతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారున్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు హాజరైన నైజీరియా బృందానికి ఉపాధ్యక్షులు జీసీవోఎన్ కాషిం షెట్టిమా ముస్తఫా నాయకత్వం వహిస్తున్నారుఈ ప్రతినిధి బృందంలో విదేశీ వ్యవహారాలుపారిశ్రామికవాణిజ్యపెట్టుబడులుసమాచార ఆవిష్కరణలు-డిజిటల్ టెక్నాలజీమానవతా వ్యవహారాలుపేదరికం తగ్గింపుమహిళా వ్యవహారాలుశాస్త్రసాంకేతిక శాఖలతో సహా వివిధ శాఖలకు చెందిన మంత్రులు ఉన్నారు.

భారత్నైజీరియా బహుముఖ సంబంధాలను నాయకులిద్దరూ సమీక్షించారువివిధ రంగాల్లో సాధిస్తున్న స్థిరమైన పురోగతి పట్ల సంతృప్తి వ్యక్తం చేశారువాణిజ్యం-పెట్టుబడులురక్షణ-భద్రతఇంధన భాగస్వామ్యంవ్యవసాయంఆరోగ్యండిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాలతో సహా ముఖ్యమైన రంగాలపై చర్చల్లో ప్రధాన దృష్టి సారించారుఇండియా-నైజీరియా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.

గ్లోబల్ సౌత్ ప్రాధాన్యాలుఆందోళనలతో సహా పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయఅంతర్జాతీయ అంశాలపై ప్రధానమంత్రి మోదీఉపాధ్యక్షులు షెట్టిమా ముస్తఫా తమ ఆలోచనలను పంచుకున్నారుబహుపాక్షిక వేదికల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవాల్సినమరింత మందికి ప్రాతినిధ్యం అందించేసమ్మిళితమైనబహుళ ధృవ అంతర్జాతీయ వ్యవస్థ కోసం కలసి పనిచేయాల్సిన అవసరాన్ని వారు స్పష్టం చేశారు.

నైజీరియాతో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానికీఆఫ్రికా దేశాలతో బంధాన్ని మరింత బలోపేతం చేయడానికీ భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ప్రధానమంత్రి మోదీ స్పష్టం చేశారునైజీరియా సామర్థ్య నిర్మాణానికీఆర్థిక వృద్ధికీ భారత్ అందిస్తున్న అభివృద్ధి అనుభవాలనుసహకారాన్ని ఉపాధ్యక్షులు షెట్టిమా ముస్తఫా ప్రశంసించారు.

ఇరు దేశాలతో పాటు విస్తృతమైన గ్లోబల్ సౌత్‌లో శాంతికీసంక్షేమానికీఅభివృద్ధికీ దోహదపడేందుకు బలమైనభవిష్యత్తు దృష్టితో కూడిన భాగస్వామ్యాన్ని నిర్మించడంలో భారత్నైజీరియా దేశాల ఉమ్మడి అంకితభావాన్ని ఈ సమావేశం పునరుద్ఘాటించింది.

***


(రిలీజ్ ఐడి: 2309886) సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Punjabi , Gujarati , Tamil , Malayalam