ప్రధాన మంత్రి కార్యాలయం
బ్రిక్స్ సదస్సులో భాగంగా న్యూఢిల్లీలో మలేషియా ప్రధానమంత్రితో సమావేశమైన భారత ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
12 SEP 2026 11:32AM by PIB Hyderabad
న్యూఢిల్లీలో సెప్టెంబర్ 12, 2026న జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మలేషియా ప్రధానమంత్రి గౌరవ డాటోసెరీ అన్వర్ బిన్ ఇబ్రహీంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు.
మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆత్మీయ స్వాగతం పలికారు. భాగస్వామ్య దేశంగా బ్రిక్స్ శిఖరాగ్ర సదస‌్సులో మలేషియా పాల్గొనటాన్ని అభినందించారు. 2026 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మలేషియా పర్యటన సాధించిన ఫలితాలను ఇరువురు నాయకులు సమీక్షించారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, సెమీకండక్టర్లు, మౌలిక సదుపాయాలు, డిజిటల్ ఎకానమీ, ఇంధనం, ఫిన్‌టెక్, విద్య, పర్యాటకం, ప్రజల మధ్య సంబంధాలతో సహా పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధించిన పురోగతిపై చర్చించారు. సబాలోని కోటా కినాబాలు నగరంలో భారత కాన్సులేట్ జనరల్‌ను ఏర్పాటు చేయటానికి మలేషియా అంగీకరించినట్లు ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం వెల్లడించారు.
ఆసియాన్-భారత్ సంబంధాలను బలోపేతం చేయటంలో మలేషియా అందిస్తున్న నిరంతర మద్దతును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఇరుదేశాల ప్రయోజనాలకు సంబంధించిన కీలక ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలను పంచుకున్నారు. భారత్-మలేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నిబద్ధతతో ఉన్నట్లు స్పష్టం చేశారు.
***
(రిలీజ్ ఐడి: 2309580)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam