బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తారా (సవరించిన) బొగ్గు బ్లాకు వేలంపై వాస్తవాలు

నాడు పోస్టు చేయడమైనది: 11 SEP 2026 12:40PM by PIB Hyderabad

ఇటీవల తారా బొగ్గు బ్లాకు వేలానికి సంబంధించిన వార్తా కథనాలు కొన్ని మీడియాలో వెలువడ్డాయి. ఈ కథనాలు తప్పుదోవ పట్టించేవిగా, అరకొర సమాచారంతో ఉన్నాయి. 2023 అనంతరం చోటుచేసుకున్న కీలక పరిణామాలను ఈ నివేదికలు పరిగణనలోకి తీసుకోలేదు. ఆ పరిణామాలే చివరికి 2026లో తారా (సవరించిన) బొగ్గు బ్లాకు వేలానికి దారితీశాయి.

 

హస్డియో అరండ్ ప్రాంతంలోని బొగ్గు బ్లాకులను వాణిజ్య బొగ్గు గనుల వేలం ప్రక్రియ నుంచి మినహాయించాలంటూ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నుంచి లేఖ అందిన నేపథ్యంలో.. 2023లో 7వ విడతలో భాగంగా వేలానికి ఉంచిన తారా బొగ్గు బ్లాకును ఆ వేలం ప్రక్రియ నుంచి తొలగించడం వాస్తవం.

 

తదనుగుణంగా.. లెమ్రు ఏనుగుల కారిడార్‌ పరిధిలోనూ విస్తరించి ఉన్న హస్డియో అరండ్ ప్రాంతంలోని బొగ్గు బ్లాకులను తదుపరి విడతల వాణిజ్య బొగ్గు గనుల వేలం పాటల్లో చేర్చలేదు.

 

అయితే.. ‘‘ఈ బొగ్గు బ్లాక్ లెమ్రు ఏనుగుల కారిడార్‌ పరిధి వెలుపలే ఉంది. కాబట్టి రాబోయే వేలం విడతలో ఈ బొగ్గు బ్లాకును చేర్చవచ్చు’’ అని పేర్కొంటూ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నుంచి 2025 డిసెంబరు 11న మరొక లేఖ అందింది.

 

దానికి అనుగుణంగా.. లెమ్రు ఏనుగుల కారిడార్ ప్రభావ ప్రాంతాన్ని మినహాయించి, వాణిజ్యపరమైన బొగ్గు గనుల వేలంలో 15వ విడత కింద ఆ బొగ్గు బ్లాకును వేలంపాటను నిర్వహించాం. ఆ వేలంపాట విజయవంతమైంది.

ఈ బొగ్గు బ్లాకు పట్ల మార్కెట్‌లో విశేషమైన ఆసక్తి వ్యక్తం కావడం ముఖ్యంగా పేర్కొనదగిన అంశం. 15వ విడతలో భాగంగా ఈ బొగ్గు బ్లాకు కోసం మొత్తం 9 సంస్థలు పోటీ పడ్డాయి. 37.50 శాతం ఆదాయ వాటా ప్రాతిపదికన ఈ బ్లాక్‌కు వేలం నిర్వహించారు. ఈ బొగ్గు బ్లాక్ ద్వారా రాష్ట్రానికి ఏటా రూ. 1,200 కోట్లకు పైగా ఆదాయం సమకూరడమే కాకుండా.. 8,000 మందికి పైగా ఉపాధి లభిస్తుందని అంచనా.

 

ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం లేవనెత్తిన ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని.. 2023 జూలైలో తారా బొగ్గు బ్లాకును వేలం ప్రక్రియ నుంచి మినహాయించిన విషయం పైన పేర్కొన్న అంశాల ద్వారా స్పష్టమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం 2025 డిసెంబరు 11న అందించిన సమాచారం, సీఎంపీడీఐఎల్ ద్వారా ఆ బ్లాకు సరిహద్దులను సవరించిన తర్వాతే.. దీనిని తిరిగి వేలం కోసం పరిగణనలోకి తీసుకున్నారు. మీడియాలో వచ్చిన కథనాలు వాస్తవాలను పూర్తిగా వెల్లడించకపోవడమే కాకుండా.. తారా (సవరించిన) బొగ్గు బ్లాకు వేలానికి దారితీసిన కీలక పరిణామాలను కూడా అవి విస్మరించాయి. 


(రిలీజ్ ఐడి: 2309179) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Punjabi , Gujarati , Tamil