విద్యుత్తు మంత్రిత్వ శాఖ
అమెరికా.. హ్యూస్టన్లో జీ20 ఇంధన సంపన్నత అంశంపై మంత్రుల స్థాయి సమావేశం
పాల్గొననున్న కేంద్ర మంత్రి శ్రీ మనోహర్ లాల్
నాడు పోస్టు చేయడమైనది:
11 SEP 2026 8:41AM by PIB Hyderabad
అమెరికా.. హ్యూస్టన్లో ఈ నెల 14, 16 తేదీల మధ్య నిర్వహించనున్న జీ20 ఇంధన మంత్రుల సమావేశంలో కేంద్ర విద్యుత్తు, గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ మనోహర్ లాల్ పాల్గొంటారు. జీ20 కూటమికి ప్రస్తుతం అమెరికా అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రపంచానికి ఇంధన భద్రతను కల్పించడం, తత్సంబంధిత ఆర్థిక సామర్థ్యాన్ని కలిగివుండటం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, దృఢతర ఇంధన సరఫరా వ్యవస్థ తదితర కీలక అంశాలపై జీ20 సభ్యదేశాల ఇంధనశాఖ మంత్రులు, సీనియర్ ప్రతినిధులు చర్చించనున్నారు.
ఇంధన భద్రత, తక్కువ ఖర్చులో ఇంధన సేవల లభ్యత, అనుమతులు, నియంత్రణ పూర్వక సామర్థ్యం, కీలక ఖనిజాలు, దృఢమైన సరఫరా వ్యవస్థలు అన్న మూడు ఇతివృత్తాలపై నిర్వహించే మంత్రుల స్థాయి కార్యక్రమాల్లో మంత్రి పాలుపంచుకుంటారు. ఇంధన భద్రతనూ, తత్సంబంధిత ఆర్థిక స్తోమతనూ బలపరచడం, సమర్థ నియంత్రణ పూర్వక ప్రాథమిక ప్రణాళికల సాయంతో నిర్ణీత కాల ప్రాతిపదికన ఇంధన రంగ మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవడంపై ప్రధానంగా చర్చిస్తారు. అలాగే సురక్షిత, దృఢ, వివిధ కీలక ఖనిజాల సరఫరా వ్యవస్థలను తీర్చిదిద్దడమెలాగనే అంశం కూడా చర్చల్లో చోటుచేసుకోనుంది.
పెరుగుతున్న భారత్ ఇంధన అవసరాలను తీర్చడానికి సమర్థమైన ఒక దృఢతర, భావి కాలం అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొనే ఇంధన వ్యవస్థను ఆవిష్కరించే దిశగా అనుసరిస్తున్న విధానాన్ని శ్రీ మనోహర్ లాల్ సమావేశంలో ప్రస్తావిస్తారు. దీంతో పాటు సంస్థాగత, విధానపరమైన సంస్కరణల మాధ్యమం ద్వారా అనుమతులు, నియంత్రణ సామర్థ్యాన్ని పెంపొందించడంలో భారత్ సంపాదించిన అనుభవాన్ని ఆయన సమావేశంలో వివరించనున్నారు. కీలక ఖనిజాల వివిధీకరణ, చక్రీయ పద్ధతిలో ఇంధన ఉత్పాదన, విలువను సృష్టించే మార్గాన్ని (వేల్యూ చైన్) అంతటినీ బలోపేతం చేయడం కోసం భారత్ అమలు చేస్తున్న విధానాలను కూడా సమావేశంలో ఆయన తెలియజేస్తారు.
ఈ సమావేశంలో మంత్రి పాలుపంచుకోవడం.. ఇంధన రంగంలో ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న తాజా సవాళ్లను పరిష్కరించడంలో ఫలితాలను అందించగల అంతర్జాతీయ సహకారం, ఉమ్మడి కార్యాచరణల పట్ల భారత్ నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది. ఆచరణీయ, సమ్మిళిత, సాంకేతికతను పంచుకొనే విధానాలకు మద్దతివ్వడాన్ని భారత్ కొనసాగిస్తుంది. అదే సమయంలో, అన్ని దేశాలకూ సురక్షిత, ఖర్చు తక్కువయ్యే, దృఢతర, సుస్థిర ప్రాతిపదిక కలిగివుండే ఇంధన వ్యవస్థలను తీర్చిదిద్దడాన్ని భారత్ ప్రోత్సహిస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2309171)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4