వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వినియోగదారు వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వశాఖ


చెన్నైలో హాల్‌మార్క్ లేని 803.99 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న బీఐఎస్

నాడు పోస్టు చేయడమైనది: 10 SEP 2026 2:38PM by PIB Hyderabad

చెన్నైలోని అంబత్తూరులోని ఒక ఆభరణాల దుకాణంలో 2026 సెప్టెంబర్ 1న నిర్వహించిన సోదాలుజప్తు తనిఖీల్లో 803.99 గ్రాముల హాల్‌మార్క్ లేని బంగారు ఆభరణాలను చెన్నైలోని భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్కార్యాలయం స్వాధీనం చేసుకుందివాణిజ్య విక్రయం కోసం హాల్‌మార్క్ లేని బంగారు ఆభరణాలను ప్రదర్శనకు ఉంచినట్లు గుర్తించిన అధికారులు భారతీయ ప్రమాణాల సంస్థ చట్టం-2016లోని సెక్షన్ 28 ప్రకారం ఈ చర్యలు తీసుకున్నారు

స్వాధీనం చేసుకున్న ఆభరణాలలో 671.50 గ్రాముల 175 మంగళసూత్రాలు (తాళిబొట్లు), 25.02 గ్రాముల 12 పిల్లల గాజులు, 86.14 గ్రాముల 40 చెవిపోగులు, 21.33 గ్రాముల బరువున్న 10 లాకెట్లు ఉన్నాయి.

అవసరమైన హాల్‌మార్కింగ్ లేకుండా వివిధ డిజైన్లురకాల ఆభరణాలను విక్రయానికి ఉంచినట్లు బీఐఎస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం గుర్తించిందిభారతీయ ప్రమాణాల సంస్థ చట్టం- 2016 నిబంధనల ప్రకారం ఈ నగలను జప్తు చేశారుసమగ్ర విచారణతదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం వీటిని స్వాధీనం చేసుకున్నారు.

స్థానిక పోలీసుల సహకారంతో బీఐఎస్ చెన్నై కార్యాలయం అధికారులుసహాయక సిబ్బంది ఈ తనిఖీలను నిర్వహించారు.

మార్కెట్ నిఘాను పెంచిన బీఐఎస్వినియోగదారుల రక్షణే ధ్యేయం

తప్పనిసరి బీఐఎస్ ధ్రువీకరణహాల్‌మార్కింగ్ నిబంధనల పరిధిలోకి వచ్చే ఉత్పత్తులు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసేందుకు బీఐఎస్ క్రమం తప్పకుండా మార్కెట్ నిఘాతదనంతర చర్యలు తీసుకుంటున్నట్లు బీఐఎస్ చెన్నై కార్యాలయ ప్రధానాధికారి శ్రీ ఎస్డీదయానంద్ తెలిపారు.

నాణ్యత లేని ఉత్పత్తుల విక్రయాలను అరికట్టడానికిబీఐఎస్ స్టాండర్డ్ మార్క్హాల్‌మార్క్ దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికిధ్రువీకరణ-  హాల్‌మార్కింగ్ వ్యవస్థపై వినియోగదారుల విశ్వాసాన్ని కాపాడటానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు ఎంతో ముఖ్యమైనవని ఆయన పేర్కొన్నారు.

అమూల్యమైన లోహ వస్తువుల స్వచ్ఛత లేదా నాణ్యతకు హాల్‌మార్కింగ్ అధికారిక గ్యారంటీని ఇస్తుందని బీఐఎస్ పేర్కొందిప్రస్తుత హాల్‌మార్కింగ్ వ్యవస్థ ప్రకారం హాల్‌మార్క్ చేసిన బంగారు ఆభరణాలపై బీఐఎస్ లోగోస్వచ్ఛతఆరు అంకెల హాల్‌మార్క్ యునీక్ ఐడెంటిఫికేషన్ (హెచ్‌యూఐడీనంబర్ ఉంటాయిహాల్‌మార్క్ చేసిన ఆభరణాల హెచ్‌యూఐడీ నిర్ధారించుకోవడానికి వినియోగదారులు 'బీఐఎస్ కేర్యాప్‌ను కూడా ఉపయోగించొచ్చు.

చట్టపరమైన చర్యలు ప్రారంభం

భారతీయ ప్రమాణాల సంస్థ చట్టం- 2016 ప్రకారం సంబంధిత వ్యక్తులపై తగిన చట్టపరమైన చర్యలు ప్రారంభించారు.

మరింత సమాచారం కోసం:

 

****


(రిలీజ్ ఐడి: 2308731) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Punjabi , Kannada