వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
థాయిలాండ్ ఉప ప్రధానమంత్రి, వాణిజ్య శాఖ మంత్రి శ్రీమతి సుఫాజీ సుతుంపున్‌తో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ సమావేశం
వాణిజ్యం, పెట్టుబడులను పెంపొందించడం, వ్యాపార సంబంధాల బలోపేతం, ఏఐటీఐజీఏ సమీక్ష పురోగతిపై భారత్- థాయిలాండ్ చర్చలు
నాడు పోస్టు చేయడమైనది:
09 SEP 2026 6:43PM by PIB Hyderabad
నేడు న్యూఢిల్లీలోని వాణిజ్య భవన్‌లో థాయ్‌లాండ్ ఉప ప్రధానమంత్రి, వాణిజ్య మంత్రి శ్రీమతి సుపాజీ సుతుంపున్‌తో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ సమావేశమయ్యారు.
భారత్–థాయ్‌లాండ్ ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు మంత్రులు చర్చించారు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను పెంచడం, వ్యాపార అవకాశాలను విస్తరించడం, ఇరు దేశాల వ్యాపార సంస్థల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ప్రధానంగా దృష్టి సారించారు.
ద్వైపాక్షిక వాణిజ్యంలో సమతుల్య, సుస్థిర వృద్ధిని ప్రోత్సహించే రంగాల్లో మరింత సహకారం, ఉమ్మడిగా పరిష్కారాలను రూపొందించడం ద్వారా భారత్, థాయ్‌లాండ్ మధ్య వాణిజ్యం, పెట్టుబడులను మరింత పెంచే మార్గాలపై ఇరుపక్షాలు అభిప్రాయాలను పంచుకున్నాయి. వ్యాపార వ్యవస్థలను బలోపేతం చేయడం, వ్యాపార సంస్థల మధ్య మరింత పరస్పర భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, సంస్థలకు మార్కెట్ అవకాశాలను విస్తరించడం కోసం ఇరు దేశాల్లో వాణిజ్య ప్రోత్సాహక కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడంపైనా చర్చించారు.
ఆసియాన్–భారత్ వస్తు వాణిజ్య ఒప్పందం (ఏఐటీఐజీఏ) సమీక్ష పురోగతిపై ఇరుపక్షాలు తమ అభిప్రాయాలను పంచుకున్నాయి. భారత్–థాయ్‌లాండ్ సంయుక్త వాణిజ్య కమిటీ (జేటీసీ) ద్వారా నిర్ణీత కాలపరిమితిలో ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా బలోపేతం చేయాల్సిన అవసరాన్ని తెలిపాయి.
రెండు దేశాల్లోని వ్యాపారాలకు అవకాశాలను కల్పించి, మార్కెట్ ప్రాప్యతను పెంచగల సమతుల్య, పరస్పర ప్రయోజనకరమైన విధాన ప్రాముఖ్యతను ఇరుపక్షాలు గుర్తించాయి.
అంతరిక్ష సాంకేతికతలు, కోల్డ్-చైన్ లాజిస్టిక్స్ (శీతలీకరణ ఆధారిత రవాణా), ఆహార శుద్ధి, ఆవిష్కరణలు, ఆరోగ్యం, సంక్షేమం, వాణిజ్యం, పెట్టుబడుల ప్రోత్సాహం వంటి వివిధ రంగాల్లో పనిచేస్తున్న థాయ్ వ్యాపార ప్రతినిధుల బృందంతోనూ ఇరువురు మంత్రులు మాట్లాడారు.
భారత్, థాయ్‌లాండ్ దేశాలకు దీర్ఘకాలిక నాగరికత, సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలతో పాటు వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను మరింత విస్తరించడంతో పాటు ప్రైవేటు రంగ సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు కృషి చేస్తున్నాయి. వాణిజ్యాన్ని సులభతరం చేయడం, మార్కెట్ ప్రాప్యతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం, ప్రాంతీయ, ప్రపంచ సరఫరా వ్యవస్థలతో సంబంధాలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఇప్పటికే ఉన్న ద్వైపాక్షిక వ్యవస్థలు కూడా పేర్కొన్నాయి.
ఆర్థిక సంబంధాలను మరింతగా పెంపొందించుకోవడానికి, వ్యాపార భాగస్వామ్యాలను బలోపేతం చేయడానికి, పటిష్టమైన, సమతుల్యమైన, పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య, పెట్టుబడి సంబంధాన్ని నిర్మించుకోవడానికి భారత్, థాయిలాండ్ దేశాలు తమ ఉమ్మడి నిబద్ధతను ఈ సమావేశం స్పష్టం చేసింది.
***
(రిలీజ్ ఐడి: 2308564)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7