నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వరల్డ్ స్కిల్స్ షాంఘై–2026లో పదకొండు కొత్త నైపుణ్య విభాగాల్లో తొలిసారిగా పోటీపడుతున్న భారత్

నాడు పోస్టు చేయడమైనది: 09 SEP 2026 12:55PM by PIB Hyderabad

2026 సెప్టెంబర్ 22 నుంచి 27 వరకు చైనాలోని షాంఘైలో జరిగే 48వ వరల్డ్ స్కిల్స్ పోటీల్లో పదకొండు కొత్త నైపుణ్య విభాగాల్లో భారత్ తొలిసారి పాల్గొంటోందితద్వారా తన ప్రపంచ నైపుణ్యాల పరిధిని విస్తరించుకుంటోంది.

స్కిల్ ఇండియా బృందంలో దాదాపు 70 మంది పోటీదారులు ఉన్నారుఈ బృందం మొత్తం 64 విభాగాలకు గాను 63 నైపుణ్య విభాగాల్లో పోటీల్లో పాల్గొంటుందివరల్డ్ స్కిల్స్ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన అతి పెద్దఅత్యంత వైవిధ్యమైన బృందాల్లో ఒకటిగా ఇది నిలుస్తుంది.

డెంటల్ ప్రోస్తెటిక్స్డిజిటల్ ఇంటరాక్టివ్ మీడియా డిజైన్ఇంటెలిజెంట్ సెక్యూరిటీ టెక్నాలజీల్యాండ్‌స్కేప్ గార్డెనింగ్ఆప్టోఎలక్ట్రానిక్ టెక్నాలజీరిటైల్ సేల్స్మానవ రహిత ఏరియల్ వ్యవస్థలుఇండస్ట్రియల్ మెకానిక్స్సాఫ్ట్‌వేర్ టెస్టింగ్హెవీ వెహికల్ టెక్నాలజీఎయిర్‌క్రాఫ్ట్ నిర్వహణ అనే పదకొండు కొత్త నైపుణ్యాల్లో భారత్ మొదటిసారి పోటీ పడనుంది.

దేశ నైపుణ్యాభివృద్ధి వ్యవస్థ సాధించిన విస్తరణనూపరిణతినీ ఈ కొత్త విభాగాల్లో భారత్ పోటీపడటం తెలియజేస్తోందిసంప్రదాయ వ్యాపారాల్లోని బలమైన పునాదుల నుంచి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలుప్రత్యేక సేవలుసృజనాత్మక పరిశ్రమలుతర్వాతి తరం పారిశ్రామిక సామర్థ్యాల దిశగా విస్తరిస్తోంది.

నైపుణ్యాభివృద్ధిఔత్సాహిక పారిశ్రామిక మంత్రిత్వ శాఖ (ఎంఎస్‌డీఈఈ బృందానికి నాయకత్వం వహిస్తోందిపారిశ్రామిక సంస్థలుశిక్షణ కేంద్రాలుఆయా రంగాల నిపుణులతో కలిసి పనిచేస్తూ నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్‌డీసీవరల్డ్‌ స్కిల్స్ కోసం భారత బృందాన్ని సన్నద్ధం చేస్తోంది.

ఈ పోటీల్లో భారత్ పాల్గొనడంపై ఎంఎస్‌డీఈ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ మాట్లాడారు. ‘‘భవిష్యత్తు అవసరాలకు తగినఅంతర్జాతీయంగా ఉపయోగపడే సామర్థ్యాల దిశగా మన నైపుణ్య వ్యవస్థ సాధిస్తున్న పరిణామాన్ని కొత్త నైపుణ్య విభాగాల్లో భారత్ పోటీపడటం తెలియజేస్తోందిబలమైన భాగస్వామ్యాలుపటిష్టమైన సన్నాహాల ద్వారా మన యువత ఆత్మవిశ్వాసంతో పోటీ పడటానికిప్రపంచ ప్రమాణాలతో తమను తాము పోల్చుకోవడానికి వీలు కల్పిస్తున్నాం’’ అని ఆమె అన్నారు.

ఆరోగ్యసేవల సాంకేతిక పరిజ్ఞానాలుడిజిటల్ డిజైన్నిఘా వ్యవస్థలుడ్రోన్ టెక్నాలజీలుఅధునాతన తయారీరవాణా పరిష్కారాలువినియోగదారు కేంద్రక సేవలతో సహా పని భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఆధునిక రంగాలకు కొత్త విభాగాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయివీటిని చేర్చడం... అంతర్జాతీయ పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను అభివృద్ధి చేయడంఅంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నైపుణ్య రంగాల్లో యువతకు అవకాశాలను అన్వేషించడంపై భారత్ సారించిన దృష్టిని స్పష్టం చేస్తోంది.

ఈ కొత్త విభాగాల్లో పోటీలకు సన్నద్ధమవడానికి కర్ణాటకలోని గవర్నమెంట్ టూల్ రూమ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ (జీటీటీసీ), గాంధీనగర్‌లోని మెట్రో‌వుడ్స్ ల్యాండ్‌స్కేప్గాంధీనగర్‌లోని నామ్‌టెక్బెన్నెట్ విశ్వవిద్యాలయంక్రోమాటైటాన్ కంపెనీ లిమిటెడ్ – తనిష్క్షాపర్స్ స్టాప్రిలయన్స్ ట్రెండ్స్ఎస్ఏఎన్‌వై హెవీ ఇండస్ట్రీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ప్రఖార్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ లిమిటెడ్డెనెక్స్‌పర్ట్ డెంటల్ ల్యాబ్ లాంటి ప్రత్యేక శిక్షణ సంస్థలుపారిశ్రామిక భాగస్వాములతో కూడిన సహకారాత్మక వ్యవస్థ తోడ్పాటు అందిస్తోంది.

అనుబంధం

ఇంటెలిజెంట్ భద్రతా సాంకేతికత: ప్రజలుమౌలిక వసతులుఆస్తులకు భద్రత కల్పించే స్మార్ట్‌ వ్యవస్థల రూపకల్పనఏర్పాటునిర్వహణపై ఈ విభాగం దృష్టి పెడుతుందిఇందులో కృత్రిమ మేధ ఆధారిత నిఘా వ్యవస్థలుస్మార్ట్‌ సెన్సర్లుస్వయంచాలక స్పందనా వ్యవస్థలు వంటి సాంకేతికతలను ఉపయోగిస్తారు.

ల్యాండ్‌స్కేప్‌ గార్డెనింగ్‌: సృజనాత్మకతతో పాటు ఆచరణాత్మకతకు ప్రాధాన్యతనిస్తూ.. పర్యావరణానికి అనుకూలమైనఉపయోగకరమైన ప్రదేశాలను రూపొందించేందుకు డిజైన్‌నిర్మాణంపర్యావరణ అవగాహనను కలిపి ఉపయోగించే రంగం ఇది.

ఆప్టోఎలక్ట్రానిక్‌ సాంకేతికత: కాంతివిద్యుత్‌ శాస్త్రాలను కలిపి ఉపయోగించే వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగం ఇదిఅధునాతన తయారీవైద్య సేవలుకమ్యూనికేషన్‌ వ్యవస్థలుస్మార్ట్‌ సాంకేతికతలు వంటి అనేక రంగాల్లో ఉపయోగపడుతుంది.

డిజిటల్ ఇంటరాక్టివ్ మీడియా డిజైన్: డిజైన్కంటెంట్అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను అనుసంధానించడం ద్వారా వివిధ వేదికల్లో ఆకట్టుకునేవినియోగదారులు చురుగ్గా పాల్గొనే డిజిటల్‌ అనుభవాలను రూపొందించడం ఈ రంగం ప్రధాన లక్ష్యం.

రిటైల్ అమ్మకాలు: ఉత్పత్తులపై సమగ్ర అవగాహనకమ్యూనికేషన్ఉత్పత్తుల ప్రదర్శననాణ్యమైన సేవలకు ప్రాధాన్యమివ్వడం ద్వారా వినియోగదారులతో మంచి సంబంధాలుఅనుభవ ఆధారిత వ్యాపార నమూనాలకు పెరుగుతున్న ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది.

భారీ వాహన సాంకేతికత: రవాణాపారిశ్రామిక వ్యవస్థలు మరింత అధునాతనంగా మారుతున్న నేపథ్యంలో లోపాలను గుర్తించడంమరమ్మతులు చేయడంనిర్వహణ చేపట్టడం వంటి సాంకేతిక నైపుణ్యాలపై  దృష్టి పెడుతుంది.

మానవ రహిత వైమానిక వ్యవస్థలు: మౌలిక సదుపాయాలువ్యవసాయం నుంచి ప్రజా సేవలుపర్యవేక్షణఅభివృద్ధి చెందుతున్న స్వయంచాలక సాంకేతికతల వరకు వివిధ రంగాల్లో డ్రోన్‌ సాంకేతికతల వినియోగంలో విస్తరిస్తున్న తీరును ప్రదర్శిస్తుంది.

డెంటల్ ప్రోస్థెటిక్స్: డెంటల్ క్రౌన్స్డెంటల్‌ ఇంప్లాంట్లుకృత్రిమ దంతాలు వంటి ప్రత్యేక దంత పరికరాలను ఖచ్చితత్వంతో రూపొందించి తయారు చేయడం ఈ రంగం ప్రధాన ఉద్దేశంఇవి నోటి ఆరోగ్యానికి సంబంధించిన పనితీరును పునరుద్ధరించడంతో పాటు జీవన నాణ్యతను మెరుగుపరుస్తాయి.

పారిశ్రామిక యంత్ర సాంకేతికత: సంక్లిష్టమైన పారిశ్రామిక యంత్రాలుఉత్పత్తి వ్యవస్థలను ఖచ్చితంగా అమర్చడంనిర్వహించడంలోపాలను గుర్తించి పరిష్కరించడంపనితీరును మెరుగుపరచడం వంటి అంశాలపై ఈ రంగం దృష్టి సారిస్తుంది.

సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌: కఠినమైన పరీక్షలుధ్రువీకరణ ప్రక్రియల ద్వారా సాఫ్ట్‌వేర్‌ నాణ్యతవిశ్వసనీయతవినియోగదారుల పనితీరును మెరుగుపరచడంలో సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌ కీలక పాత్ర పోషిస్తుంది.

విమానాల నిర్వహణ: సంపూర్ణ భద్రతనిబంధనలకు అనుగుణంగా వాటి నిర్వహణను నిర్ధారించేందుకు విమానంలోని యాంత్రికవిద్యుత్‌ద్రవనిర్మాణ వ్యవస్థలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారుఅవసరమైన సర్వీసింగ్‌సమస్యల పరిష్కారంమరమ్మతులతో పాటు విమానం ప్రయాణానికి సురక్షితంగా ఉందో లేదో కూడా కఠినమైన పరీక్షల ద్వారా నిర్ధారిస్తారు.

 

***


(రిలీజ్ ఐడి: 2308331) సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Tamil , English , Urdu , हिन्दी , Bengali , Gujarati