ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గంజాయి అక్రమ రవాణాపై దేశవ్యాప్తంగా చేపట్టిన దాడుల ద్వారా 740 కేజీల గంజాయి, చరస్ ను స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ...13 మంది అరెస్టు

నాడు పోస్టు చేయడమైనది: 09 SEP 2026 11:05AM by PIB Hyderabad

మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై నిఘా వర్గాల సమాచారం మేరకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐఅధికారులు దేశవ్యాప్తంగా ఎనిమిది కీలక ప్రాంతాలపై దాడులు చేశారు15 రోజులపాటు సాగిన ఈ దాడుల్లో దాదాపు 740 కేజీల గంజాయి (హైడ్రోపోనిక్ గంజాయి సహా), చరస్‌ను స్వాధీనం చేసుకున్నారుదీనికి సంబంధించి ఎన్‌డీపీఎస్ చట్టం-1985 ప్రకారం13 మందిని అరెస్టు చేశారుస్వాధానం చేసుకున్న మాదకద్రవ్యాల్లో 709.6 కేజీల గంజాయి, 24.5 కేజీల హైడ్రోపోనిక్ గంజాయి, 5 కేజీల చరస్ ఉన్నాయి.

నిఘా వర్గాల సమాచారం ఆధారంగా 08.09.2026న జరిగిన దాడిలో రాయ్‌పూర్ సమీపంలోని ఓల్డ్ ధంతరి రోడ్ వద్ద విశాఖపట్నం నుంచి వస్తున్న రెండు ట్రక్కులను డీఆర్ఐ అధికారులు తనిఖీ చేశారు. సరకును లారీల్లోకి తరలిస్తున్న ప్రాంతాల్లో 10 సంచుల్లో ఉన్న 61 ప్యాకెట్లలో గంజాయి ఉన్నట్లు అనుమానించారుపరీక్షలు నిర్వహించగా అది గంజాయి అని తేలిందిఈ తనిఖీల్లో భాగంగా 375.95 కేజీల గంజాయినిరవాణా చేస్తున్న రెండు ట్రక్కులను స్వాధీనం చేసుకున్నారుఎన్‌డీపీఎస్ చట్టం-1985 కింద నలుగురిని అరెస్టు చేశారు.

అంతకు ముందు 26.08.2026న రాయ్‌పూర్ సమీపంలో... ఓ ట్రక్కులో 124 కేజీల గంజాయిని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారుట్రక్కును స్వాధీనం చేసుకుని ఎన్‌డీపీఎస్ చట్టం-1985 ప్రకారం ఒకరిని అరెస్టు చేశారు.

సరైన సమాచారంతో ఈ నెల 5, 6 తేదీల్లో నిర్వహించిన మరికొన్ని దాడుల్లో పాట్నా సమీపంలోని ఔరంగాబాద్-పాట్నా హైవేపై డీఆర్ఐ అధికారులు ఓ లారీని అడ్డగించారుఈ తనిఖీల సమయంలో అధికారులపై దాడి జరగడంతో ఒక అధికారికి గాయాలయ్యాయిలారీ డ్రైవర్ పరారయ్యాడువాహనాన్ని తనిఖీ చేయగాడ్రైవర్ క్యాబిన్ వెనక రహస్య అరలోని 90 ప్యాకెట్లలో గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారుఎన్‌డీపీఎస్ చట్టం-1985 ప్రకారం140.5 కిలోల గంజాయినిలారీని స్వాధీనం చేసుకున్నారు.

పంజాబ్‌లోని లుథియానా సమీపంలో ఈ నెల 1, 2వ తేదీల్లో మరొక అనుమానాస్పద వాహనాన్ని డీఆర్ఐ అధికారులు అడ్డగించారుతనిఖీ చేయగాకారు కింద భాగంలోని రహస్య అరల్లో దాచిన 67 గంజాయి ప్యాకెట్లలో 69 కిలోల గంజాయిని గుర్తించారుఅక్రమంగా రవాణా చేస్తున్న గంజాయినివాహనాన్ని స్వాధీనం చేసుకుని… ఎన్‌డీపీఎస్ చట్టం-1985 ప్రకారం ఇద్దరిని అరెస్టు చేశారు.

డీఆర్ఐ అధికారులకు అందిన సమాచారం ఆధారంగా 03.09.2026న గోరఖ్‌పూర్ రైల్వేస్టేషన్లో అమర్‌నాథ్ ఎక్స్‌ప్రెస్ రైలు సాధారణ బోగీలో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులను తనిఖీ చేశారుఇద్దరు ప్రయాణికుల తొడ భాగంలోమోకాలి తొడుగుల వంటి కవర్లలోచీరల లోపల దాచిన సుమారు కిలోల చరస్ బయటపడిందిఈ చరస్‌ను నేపాల్ నుంచి అక్రమంగా తీసుకొచ్చినట్లు దర్యాప్తులో తేలిందిచరస్‌ను స్వాధీనం చేసుకుని ఎన్‌డీపీఎస్ చట్టం-1985 ప్రకారం ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.

గత 15 రోజుల్లో మూడు వేర్వేరు దాడుల్లో హనోయ్వియత్నాంబ్యాంకాక్థాయిలాండ్ నుంచి హెదరాబాద్బెంగళూరు విమానాశ్రయాలకు చేరుకున్న ముగ్గురు ప్రయాణికులను డీఆర్ఐ అధికారులు అడ్డుకున్నారువారి నుంచి అధికంగా మత్తును కలిగించే సుమారు 24.6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారుఎన్‌డీపీఎస్ చట్టం-1985 ప్రకారం ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.

మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై డీఆర్ఐ నిరంతరం దృష్టి సారిస్తున్నట్లు ఈ దాడుల ద్వారా తెలుస్తోందిరోడ్డురైలువిమాన మార్గాలు... వాహనాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరలురహస్య గదులుప్రయాణికుల లగేజీల్లో దాచిన మాదకద్రవ్యాలను అధికారులు గుర్తిస్తున్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2308225) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Gujarati , Tamil , Kannada