ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డాక్టర్ భూపేన్ హజారికా శత జయంతి..నివాళులు అర్పించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 08 SEP 2026 11:55AM by PIB Hyderabad

మహనీయుడు డాక్టర్ భూపేన్ హజారికా శత జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.
డాక్టర్ భూపేన్ హజారికా గళం అస్సాం ఆత్మతో పాటు ఈశాన్య ప్రాంతాల ఉత్సాహాన్ని దేశం నలుమూలలకూ చేరవేసిందని ప్రధానమంత్రి ప్రశంసించారుడాక్టర్ హజారికా తన సంగీతంతో అసంఖ్యాకుల ఆలోచనలనుభావాలను సుందరంగా వ్యక్తీకరించారనీప్రజలను చేరువగా తీసుకువచ్చారనీ ప్రధానమంత్రి వర్ణించారు.
కిందటి సంవత్సరం గువాహాటీలో డాక్టర్ హజారికా శత జయంతి ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నప్పటి జ్ఞాపకాలను శ్రీ మోదీ ఆప్యాయంగా గుర్తుచేసుకున్నారు.
భూపేన్ దా జీవితంఆయన సృజనలు భావి తరాల వారికి కూడా స్ఫూర్తిని అందిస్తుంటాయని ప్రధానమంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘
మహానుభావుడు డాక్టర్ భూపేర్ హజారికా గారిని ఆయన వందో జయంతి సందర్భంగా స్మరించుకుంటున్నాను.
ఆయన గళం అస్సాం ఆత్మనీఈశాన్య ప్రాంతాల ఉత్సాహాన్నీ దేశ ప్రజలందరి చెంతకు చేరవేసింది.
ఆయన తన సంగీతంతో అసంఖ్యాకుల ఆలోచనలనుభావనలను సుందరంగా వ్యక్తీకరించారుఆయన పాటలు ప్రజలను సన్నిహితం చేశాయి.
కిందటి ఏడాది గువాహాటీలో ఆయన శత జయంతి ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో పాలుపంచుకోవడాన్ని
నేను ఆప్యాయంగా గుర్తుచేసుకుంటున్నానుభూపేన్ దా జీవితంఆయన సృజనలు రాబోయే  తరాల వారికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి’’ అని పేర్కొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2307772) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Bengali , Manipuri , Gujarati , Tamil , Kannada , Malayalam