ప్రధాన మంత్రి కార్యాలయం
ఇటలీ యుద్ధానంతర చరిత్రలో అత్యంత ఎక్కువ కాలం నిరంతరంగా ప్రధానమంత్రిగా కొనసాగుతున్న జార్జియా మెలోనీకి ప్రధానమంత్రి అభినందనలు
నాడు పోస్టు చేయడమైనది:
04 SEP 2026 1:07PM by PIB Hyderabad
ఇటలీ యుద్ధానంతర చరిత్రలో అత్యంత ఎక్కువ కాలం నిరంతరంగా ప్రధానమంత్రిగా కొనసాగుతున్న ఘనత సాధించిన ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు అభినందనలు తెలిపారు.
ఈ మైలురాయి ఇటలీ ప్రజలు ఆమె నాయకత్వంపై ఉంచిన విశ్వాసం, నమ్మకానికి నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. భారత్-ఇటలీ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఆమె స్నేహం కీలక పాత్ర పోషించిందని తెలిపారు. ఇరు దేశాల ప్రజలకు సుసంపన్నమైన భవిష్యత్తును నిర్మించేందుకు ఆమెతో సన్నిహిత సహకారాన్ని కొనసాగించడానికి ఎదురుచూస్తున్నానని అన్నారు. రానున్న సంవత్సరాల్లో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమనంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
“ఇటలీ యుద్ధానంతర చరిత్రలో అత్యంత ఎక్కువ కాలం నిరంతరంగా ప్రధానమంత్రిగా కొనసాగుతున్న వ్యక్తిగా నిలిచిన నా స్నేహితురాలు ప్రధానమంత్రి మెలోనీకి అభినందనలు. ఈ మైలురాయి ఇటలీ ప్రజలు ఆమె నాయకత్వంపై ఉంచిన విశ్వాసం, నమ్మకానికి నిదర్శనం.
భారత్-ఇటలీ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఆమె స్నేహం కూడా కీలక పాత్ర పోషించింది.
ఇరు దేశాల ప్రజలకు సుసంపన్నమైన భవిష్యత్తును నిర్మించేందుకు మన సన్నిహిత సహకారాన్ని కొనసాగించడానికి నేను ఎదురుచూస్తున్నాను.
రానున్న సంవత్సరాల్లో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని నా హృదయపూర్వక శుభాకాంక్షలు.”
***
(రిలీజ్ ఐడి: 2306702)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12