ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘సెమీకాన్ ఇండియా-2026’పై మాధ్యమాలకు ఆహ్వానం

మీడియా ప్రతినిధులు.. సందర్శకుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం

నాడు పోస్టు చేయడమైనది: 03 SEP 2026 5:52PM by PIB Hyderabad

  న్యూఢిల్లీలోని యశోభూమి (ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్)లో ‘సెమీకాన్ ఇండియా-2026’ 5వ మహాసభను ఈ నెల 17 నుంచి 19 వరకూ నిర్వహిస్తారు. “సిలికాన్ టు సిస్టమ్స్: బిల్డింగ్ ది ఇకోసిస్టమ్” ఇతివృత్తంగా సాగే ఈ కార్యక్రమం కోసం నేటినుంచి మాధ్యమాల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించారు. అలాగే, సందర్శకులు కూడా అధికారిక ‘సెమీకాన్ ఇండియా రిజిస్ట్రేషన్ పోర్టల్’ ద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చు.

ఈ మేరకు వివిధ మాధ్యమాల ప్రతినిధులు, సిబ్బంది ‘రిజిస్టర్ నౌ’ ల్యాండింగ్ పేజీలో “విజిటర్స్” ఆప్షన్‌ను ఎంచుకుని, తమ ఖాతాను సృష్టించుకోవాలి. అందులో ప్రవేశించిన తర్వాత దరఖాస్తుదారులు తమ ప్రాథమిక వివరాలను నమోదు చేసి, కేటగిరీ కింద “మీడియా”ను ఎంచుకోవాలి.

ఇక సందర్శకులు సెప్టెంబరు 17 నాటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావడంపై తమ ప్రాధాన్యాన్ని తెలుపవచ్చు. సౌలభ్యంపై తుది నిర్ధారణకు లోబడి వారికి హాజరయ్యే అవకాశం లభిస్తుంది. ప్రధాన ఉపన్యాసాలు, వర్క్‌ షాప్‌లు, బృంద గోష్ఠులపై సమాచారం కోసం ‘సెమికాన్ ఇండియా’ వెబ్‌సైట్‌లోని ‘ప్రోగ్రామ్ ఎట్ ఎ గ్లాన్స్’ను కూడా చూడవచ్చు.

‘సెమీకాన్ ఇండియా’ నేపథ్యం

భారత ప్రసిద్ధ సెమీకండక్టర్ కాన్ఫరెన్స్-ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ‘సెమీకాన్ ఇండియా’గా వ్యవహరిస్తారు. “ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్‌ఎం, కేంద్ర ఎలక్ట్రానిక్స్-ఐటీ మంత్రిత్వ శాఖ, ‘ఎస్‌ఈఎంఐ’ ఈ మహాసభను సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీలో భారత్‌ ఒక విశ్వసనీయ అంతర్జాతీయ కూడలిగా  రూపొందాలనే దార్శనికత సాకారానికి ఇది తోడ్పడుతుంది. ఈ దిశగా సహకారం, ఆవిష్కరణ, తయారీ, పెట్టుబడులకు ప్రోత్సాహంతోపాటు ప్రతిభను ప్రోదిచేయడంలో ప్రపంచ సెమీకండక్టర్-ఎలక్ట్రానిక్స్ వ్యవస్థను సమీకృతం చేసే ప్రధాన వేదికగా ఇది ఉపయోగపడుతుంది.

 

‘సెమీకాన్ ఇండియా’పై మరింత సమాచారం కోసం, కింది లింక్‌ను అనుసరించండి.

 

***


(రిలీజ్ ఐడి: 2306577) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati