రైల్వే మంత్రిత్వ శాఖ
రైల్వే భద్రత, సాంకేతిక, నిర్వహణ సంబంధిత లోపాలను మెరుగుపరచాలని ఆదేశించిన కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్
నాణ్యత లేని సరఫరాలు, ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంపై కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశం
నాడు పోస్టు చేయడమైనది:
03 SEP 2026 7:23PM by PIB Hyderabad
కేంద్ర రైల్వే మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ఈ రోజు రైల్ భవన్‌లో రైల్వే భద్రతపై సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రైల్వే బోర్డు ఛైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సహా రైల్వే బోర్డు సభ్యులు, జోనల్ రైల్వే జనరల్ మేనేజర్లు, డైరెక్టర్ జనరల్స్ (డీజీలు), డివిజనల్ రైల్వే మేనేజర్లు (డీఆర్ఎంలు) హాజరయ్యారు.
ఈ సమావేశంలో రైల్వే మంత్రి మాట్లాడుతూ... సిగ్నలింగ్ వ్యవస్థకు సంబంధించిన సాంకేతిక లోపాలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఓవర్‌హెడ్ ఎక్విప్‌మెంట్ విషయంలో... నిర్దేశిత కాలపరిమితి పూర్తయిన విడిభాగాల నిర్వహణ, వాటిని మార్చడం కోసం అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
కార్యశాలల్లో నిర్వహణ స్థాయిని మెరుగుపరచడం, కోచ్‌ల నిర్వహణ సహా ముఖ్యంగా అగ్నిమాపక భద్రతకు సంబంధించిన విద్యుత్ వలయాలు, వైరింగ్పైనా ప్రత్యేక శ్రద్ధ వహించాలని రైల్వే మంత్రి ఆదేశించారు. వ్యాగన్లు, కోచ్‌ల కప్లర్లు, చక్రాల నిర్వహణపైనా దృష్టి సారించాలని సూచించారు.
ట్రాక్ నిర్వహణకు సంబంధించి... పాయింట్ మెషీన్లు, టర్న్అవుట్లు, ఫాస్టనర్ల సరైన నిర్వహణను నిర్ధారించుట గురించి ప్రధానంగా చర్చించారు. ఫాస్టనర్లు అందుబాటులో లేనిచోట, వాటిని అమర్చడానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
నాణ్యత లేని సరఫరాల విషయంగా కఠిన చర్యలు తీసుకోవాలని సమావేశంలో కేంద్ర మంత్రి ఆదేశించారు. సిగ్నలింగ్-టెలికమ్యూనికేషన్, ఓహెచ్ఈ, ట్రాక్, కోచ్‌లు, వ్యాగన్లకు సంబంధించిన సామాగ్రి నాణ్యతలో ఏదైనా లోపం ఉన్నట్లయితే... సంబంధిత సరఫరాదారుపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం గమనించినప్పుడు, సంబంధిత సరఫరాదారులను శాశ్వతంగా బ్లాక్‌లిస్ట్‌లో ఉంచాలని కేంద్ర మంత్రి ఆదేశించారు.
పండగలు లేదా జాతరల కారణంగా ప్రయాణికుల రద్దీ అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో అవసరమైన సౌకర్యాలను సకాలంలో అందుబాటులో ఉంచేందుకు రాష్ట్ర, జిల్లా యంత్రాంగాలతో సమన్వయం ద్వారా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని రైల్వే మంత్రి అధికారులకు సూచించారు.
***
(రిలీజ్ ఐడి: 2306574)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8