వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్ - ఆఫ్ఘనిస్థాన్ సంయుక్త వాణిజ్య కార్యవర్గబృందం వర్చువల్ సమావేశం... ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేసే చర్యలపై సమీక్ష


వాణిజ్య సౌలభ్యం, సుంకాల పరంగా సహకారం, అనుసంధానం, పెట్టుబడులపై చర్చ

వాణిజ్య సంబంధాల బలోపేతం దిశగా తదుపరి చర్యలపై అంగీకారం

నాడు పోస్టు చేయడమైనది: 02 SEP 2026 11:08AM by PIB Hyderabad

భారత్ - ఆఫ్ఘనిస్థాన్ వర్తక, వాణిజ్య, పెట్టుబడుల సంయుక్త కార్యవర్గ బృందం (జేడబ్ల్యూజీ) 2026 సెప్టెంబరు 1న వర్చువల్‌గా సమావేశాన్ని నిర్వహించింది. వాణిజ్యం, పరిశ్రమలు, సుంకాలు, నియంత్రణ సంస్థలు, దౌత్య కార్యాలయాల ప్రతినిధులతోపాటు... భారత్, ఆఫ్ఘనిస్థాన్‌లకు చెందిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారానికి సంబంధించిన వివిధ అంశాలను ఇరుపక్షాలూ సమీక్షించాయి. వాణిజ్య సౌలభ్యాన్ని మరింత మెరుగుపరచడంతో పాటు ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసే దిశగా తీసుకోవాల్సిన చర్చలపై చర్చించాయి.

వాణిజ్య సౌలభ్యం, సుంకాల విషయంలో సహకారం, ఆఫ్ఘన్ వ్యాపారులకు వీసా సౌలభ్యం, బ్యాంకింగ్, ఆర్థిక సహకారం, ఔషధ - వ్యవసాయ వాణిజ్యం, ఇంధన సహకారం, పెట్టుబడి - వాణిజ్య ప్రోత్సాహం, సుంకాల్లో రాయితీలు, సరుకు రవాణా అనుసంధానం, ఓడరేవు సంబంధిత అంశాలు సహా పలు కీలక అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు.

సంస్థాగత సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు, అలాగే మెరుగైన కస్టమ్స్ - డేటా వినిమయ సహకారం, ఔషధాలు - వ్యవసాయ రంగాల్లో నియంత్రణ పరమైన సహకారం, మెరుగైన వాణిజ్య అనుసంధానం, పెట్టుబడి – వ్యాపార సంబంధాలను ప్రోత్సహించడం వంటి కీలక రంగాల్లో పురోగతి దిశగా చర్యలు చేపట్టేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి.

స్నేహపూర్వక, నిర్మాణాత్మక వాతావరణంలో ఈ సమావేశం జరిగింది. భారత్ - ఆఫ్ఘనిస్తాన్ వర్తక, వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నట్టు ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి. చర్చించిన అంశాలపై నిరంతర సంప్రదింపులను కొనసాగించడంపై అంగీకారానికి వచ్చాయి.  

 

***


(రిలీజ్ ఐడి: 2305885) సందర్శకుల సూచీ సంఖ్య : : 50