ప్రధాన మంత్రి కార్యాలయం
భారత్ 7.8 శాతం జీడీపీ వృద్ధి సాధించడంపై ప్రధానమంత్రి ప్రశంస
నాడు పోస్టు చేయడమైనది:
31 AUG 2026 5:09PM by PIB Hyderabad
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 7.8 శాతంగా నమోదు కావడాన్ని ‘అసాధారణ ఘనత’గా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభివర్ణించారు. ముడిచమురు ధరల్లో ఒడుదొడుకులు, సరఫరా వ్యవస్థలో అంతరాయం, ప్రపంచవ్యాప్త అనిశ్చితి తదితరాల నడుమన సాధించిన ఈ విజయం భారత ప్రజానీకం సమష్టి శక్తికి, దృఢ సంకల్పానికి నిదర్శనమని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
ఈ మేరక సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“భారత్ జీడీపీ 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధితో అసాధారణ ఘనతను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి, ముడిచమురు ధరల్లో హెచ్చుతగ్గులు, సరఫరా వ్యవస్థలో సమస్యలు వంటి ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా మన ప్రజల సమష్టి శక్తిసామర్థ్యాలతో దేశం ఇంతటి వృద్ధిని సాధించగలిగింది. విపత్తును ఆకాంక్షించే వారి జోస్యాల అంచనాలు తప్పాయి.. భారత్ మరోసారి వికసించింది!” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2305063)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8