ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆర్మేనియా దేశ ప్రధానితో ప్రధానమంత్రి శ్రీ మోదీ భేటీ

నాడు పోస్టు చేయడమైనది: 31 AUG 2026 3:57PM by PIB Hyderabad

కిర్గిజ్‌ దేశంలోని బిష్కెక్‌లో జరుగుతున్న 26వ షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశం సందర్భంగా అర్మేనియా ప్రధానమంత్రి శ్రీ నికోల్‌ పషిన్యాన్‌తో ప్రధాననమత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు భేటీ అయ్యారు. ఈ ఏడాది జూన్‌లో అర్మేనియాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల అనంతరం శ్రీ పషిన్యాన్‌ మరోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరువురు ప్రధానులు మధ్య జరిగిన తొలి సమావేశం ఇదే.

 

ఎన్నికల్లో విజయం సాధించి తిరిగి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ పషిన్యాన్‌కు ప్రధాని శ్రీ మోదీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు రక్షణ, ఆర్థిక, ఔషధ, గనులు, విద్య, సాంస్కృతిక రంగాలతో పాటు ద్వైపాక్షిక సహకారంపై చర్చించారు. ఇటీవలి కాలంలో పలు రంగాల్లో భారత్‌–అర్మేనియా సహకారం విస్తరించడంపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య ప్రత్యేకమైన స్నేహపూర్వక, సన్నిహిత సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.

 

పశ్చిమాసియా పరిస్థితులతో సహా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించారు. ప్రాంతంలో శాంతి, సుస్థిరత సాధించేందుకు చర్చలు, దౌత్య మార్గాల ద్వారా నిరంతర ప్రయత్నాలు కొనసాగించాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ స్పష్టం చేశారు.

 

అర్మేనియా–అజర్‌బైజాన్‌ శాంతి ఒప్పందం అమలు ప్రస్తుత స్థితిగతులను ప్రధానికి శ్రీ పషిన్యాన్‌ వివరించారు.

 

 

పరస్పర ప్రయోజనం కలిగిన రంగాల్లో సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంతో పాటు, భారత్‌–అర్మేనియా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కలిసి పనిచేయాలని ఇరువురు నేతలు అంగీకరించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2304981) సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Assamese , Manipuri , Gujarati , Tamil , Kannada