ఎరువుల విభాగం
ఎరువుల విభాగం
డేటా ఆధారిత ఎరువుల నిర్వహణలో కొత్త దశకు నాంది పలుకుతున్న
ఇంటిగ్రేటెడ్ ఫర్టిలైజర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఐఎఫ్ఎమ్ఎస్)
మేరా ఫసల్ మేరా బ్యోరా (ఎమ్ఎఫ్ఎమ్‌బీ)తో ఐఎఫ్ఎమ్ఎస్ ఏకీకరణ..
డేటా ఆధారిత ఎరువుల నిర్వహణ బలోపేతం
‘ఆధార్’తో జతపడ్డ 14 కోట్ల కన్నా ఎక్కువ మంది కొనుగోలుదారులను 2.5 లక్షల మందికి పైగా రిటైల్ వ్యాపారస్తులతో కలుపుతున్న ఐఎఫ్ఎమ్ఎస్..
ఏటా దాదాపు 7 కోట్ల మెట్రిక్ టన్నుల ఎరువుల లావాదేవీల నిర్వహణకు మార్గం సుగమం
నాడు పోస్టు చేయడమైనది:
30 AUG 2026 4:21PM by PIB Hyderabad
భారత్‌లో ఎరువుల నిర్వహణకు సంబంధించి కీలక పాత్రను పోషిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఫర్టిలైజర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఐఎఫ్ఎమ్ఎస్.. iFMS)లో ఒక కొత్త దశకు శ్రీకారం చుట్టారు. పారదర్శకత్వాన్ని పటిష్ఠపరచడం, ఎరువుల లభ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా ఎరువుల సరఫరా వ్యవస్థను మరింత ప్రభావవంతంగా, డేటా ఆధారిత పర్యవేక్షణకు అనువుగా తీర్చిదిద్దడానికి అనేక డిజిటల్ మాధ్యమ ప్రధాన కార్యక్రమాలను అమలుచేయబోతున్నారు.
ఎరువుల విభాగాన్ని దృష్టిలో పెట్టుకొని ఐఎఫ్ఎమ్ఎస్‌ను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) అభివృద్ధిపరిచడంతో పాటు, సాంకేతిక సాయాన్ని కూడా అందిస్తున్నది. ఎరువుల ఉత్పత్తి, దిగుమతులు, రవాణా, నిల్వ లభ్యత, రిటైల్ విక్రయాలు, సబ్సిడీ ప్రక్రియ సహా ఎరువుల విస్తారిత అనుబంధ వ్యవస్థ (ఇకోసిస్టమ్)లోని ముఖ్య దశలన్నిటినీ ఐఎఫ్ఎమ్ఎస్ ఏకీకరిస్తోంది. జాతీయ స్థాయిలో కార్యకలాపాలను నిర్వహించే ఈ వ్యవస్థ ‘ఆధార్’తో ముడిపడిన 14 కోట్ల కన్నా ఎక్కువ మంది ఎరువుల కొనుగోలుదారులతో పాటు ఒక్కో సంవత్సరంలో దాదాపు 7 కోట్ల మెట్రిక్ టన్నుల ఎరువుల విక్రయ లావాదేవీలను కూడా పర్యవేక్షిస్తోంది. దీంతో సుమారు రూ.2 లక్షల కోట్ల విలువ గల వార్షిక ఎరువుల సబ్సిడీ అందజేతకు ఈ వ్యవస్థ తోడ్పాటును అందించగలుగుతోంది.
లావాదేవీల పర్యవేక్షణకు మించి పరిధిని విస్తరించుకొంటున్న ఐఎఫ్ఎమ్ఎస్
గత కొన్ని సంవత్సరాల్లో, ఐఎఫ్ఎమ్ఎస్ పాత్రను ఎరువుల లావాదేవీలను నమోదు చేయడానికి మించి ఉండే రీతిన ఎరువుల విభాగం విస్తరించింది. దీనిని ఒక ఏకీకృత పర్యవేక్షణ ప్రధాన, నిర్ణయాల రూపేణా మద్దతిచ్చే వేదికగా తీర్చిదద్దడంపై దృష్టిని కేంద్రీకరించారు.
అధికారులకు ఎరువుల ఉత్పత్తి, దిగుమతులు, తరలింపు, రాకపోకలు, నిల్వల నిర్వహణ, రిటైల్ అమ్మకాలు.. వీటన్నిటి సమగ్ర పర్యవేక్షణకు అవకాశాన్ని కల్పించడానికి గాను కొత్త డ్యాష్‌బోర్డులతో పాటు విశ్లేషణ ప్రధాన సాధనాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సాధనాలు జాతీయ, రాష్ట్ర, జిల్లా, రిటైల్ వ్యాపారుల స్థాయులలో పర్యవేక్షణకు మార్గాన్ని సుగమం చేస్తాయి. ఫలితంగా అసాధారణ సరళులు, మార్పులకు లోను కాగల సరఫరా పరిస్థితులను ప్రాథమిక దశలోనే గుర్తించే అవకాశం ఉంటుంది.
విశ్లేషణాత్మక సమాచారాన్ని అధికంగా ఉపయోగిస్తుండడం వివిధ కొనుగోలు శ్రేణుల, పొలాల, పంటల, జిల్లాల, ఎరువుల రకాల్లో ఫర్టిలైజర్ కొనుగోళ్ల వ్యవహారాలను సరిచూడగలిగేందుకు వీలు ఏర్పడింది. ఈ కారణంగా భారీ పరిణామంలో జరిగే అమ్మకాలను.. ఐఎఫ్ఎమ్ఎస్ మాధ్యమం ద్వారా.. నమోదు చేయగలగడం ఒక్కటే కాకుండా, ఎరువుల వినియోగ తీరుతెన్నులను కూడా తెలుసుకోవచ్చు; పక్కా పర్యవేక్షణతో పాటు విషయాలు తెలుసుకొని మరీ నిర్ణయాలను తీసుకోవచ్చు.
రైతులు, భూమి, పంటల సంబంధిత సమాచారం ఒకే చోటుకు
రాష్ట్రాలు, ఇతర ప్రభుత్వ వేదికల ద్వారా సిద్ధం చేసిన రైతుల, భూ, పంటల సంబంధిత సమాచార నిధి (డేటా బేస్)తో ఐఎఫ్ఎమ్ఎస్‌ను ఏకీకరించడంతో డేటా ఆధారిత ఎరువుల నిర్వహణలో ఓ ముఖ్య నిర్ణయాన్ని తీసుకున్నట్లయింది.
హర్యానాలో ‘మేరీ ఫసల్ మేరా బ్యోరా’ (ఎమ్ఎఫ్ఎమ్‌బీ)తో ఏకీకరణ, ఆ తరువాత అగ్రీస్టాక్ (AgriStack)తో ఏకీకరణ దిశగా తీసుకున్న నిర్ణయాలతో... రైతులు, వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని ఎరువుల లావాదేవీలతో జోడించడానికి తగిన యంత్రాంగాలను ఆవిష్కరించినట్లు అయింది.
రైతులు, భూమి రికార్డులతో ఎరువుల కొనుగోలుదారులకు జోడించే అత్యంత కీలక అనుభవాన్ని ఈ కార్యక్రమాలు అందించాయి. అంతేకాక భూమికీ, పంటలకీ సంబంధించిన సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావడం, పూర్ణత్వంతోనూ, నాణ్యతతోనూ ముడిపడిన ఆచరణాత్మక అంశాలను కూడా వెలుగులోకి తీసుకు రావడం చేయగలిగారు. దీంతో పాటే, ఈ కార్యక్రమాలను అమలుచేసినందువల్ల ఎరువుల లావాదేవీల సమాచారాన్ని వ్యావసాయిక సమాచారంతో జతపరిచేందుకూ అవకాశం లభించింది. ఇది ఎరువుల అవసరాలను, వినియోగాన్ని ఇదివరకటితో పోలిస్తే మెరుగ్గా అర్థం చేసుకొనేందుకు వీలు కల్పించింది.
ఈ ఏకీకరణల వల్ల అందిన అనుభవం.. రైతుల అవసరాలతో ఎరువుల కొనుగోళ్లను జోడించడంలో మునుపటి కన్నా ఎక్కువ వ్యవస్థీకృత వైఖరిని అనుసరించడానికి దోహదం చేసింది.
ఎరువుల అమ్మకాల ప్రాథమిక ప్రణాళికలో అదనంగా జతపడ్డ డిజిటల్ మాధ్యమ అధ్యాయం
ఈ అనుభవాన్ని ఆధారంగా చేసుకొని, ఫ్రేంవర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్స్ (ఎఫ్ఎఫ్ఎస్) కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. మొబైల్ యాప్ ఆధారిత ఎరువుల బుకింగ్ వ్యవస్థను ఇప్పుడున్న ఐఎఫ్ఎమ్ఎస్ పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) ఇకోసిస్టమ్‌తో జతపరిచే కీలక కార్యక్రమంగా దీనిని తెర మీదకు తెచ్చారు.
ఈ ప్రాథమిక ప్రణాళిక (ఫ్రేంవర్క్)లో భాగంగా, ఒక రైతు తన భూమి, యాజమాన్య వివరాలను సరిచూసే ప్రక్రియ పూర్తి అయిన తరువాత ‘అగ్రీస్టాక్’లో జనరేట్ చేసిన తన ఐడీ (ID) ఆధారంగా అవసరమైన మేరకు ఎరువును బుక్ చేసుకోవచ్చు. దీంతో క్యూఆర్ (QR) ఆధారిత బుకింగు జనరేట్ అవుతుంది. బుకింగ్ గురించిన సమాచారాన్ని పీఓఎస్ పరికరంలో నమోదు చేస్తారు. దీంతో అవసరమైన ఎరువుతో పాటు చివరకు కొనుగోలు చేసిన పరిమాణం.. వీటిని సరి చూడడం సాధ్యమవుతుంది.
ఈ ప్రాథమిక ప్రణాళికను దశ వారీగా అమలు చేస్తున్నారు. దీనితో ఎరువుల విభాగానికి, పాలుపంచుకుంటున్న రాష్ట్రాలకూ విస్తృత కార్యాచరణను అనుసరించడానికి ముందుగా.. బుకింగ్ ధోరణి, భూ సంబంధిత, పంటల సంబంధిత సమాచారం, ఎరువుల వినియోగం, నిర్వహణ సంబంధిత సవాళ్లను అధ్యయనం చేసే అవకాశం లభిస్తుంది. ఈ ప్రయోగాత్మక పథకం ‘అగ్రీస్టాక్’కు, ఐఎఫ్ఎమ్ఎస్‌కు మధ్య కీలక నూతన ప్రమాణీకరణ, విశ్లేషణాత్మక కసరత్తుకు కూడా రంగాన్ని సిద్ధం చేసింది.
ఒక్కో హెక్టారుకు ఎరువు వినియోగం, వివిధ కేటగిరీలకు చెందిన కమతాల్లో వినియోగం తీరు, ఉత్పాదనల వారీగానూ, పంటల వారీగానూ ఎరువు వాడకం, బుకింగ్ సమయంలో ఎంత ఎరువు అవసరమవుతుందని సూచించి, నిజంగా ఎంత ఎరువును కొనుగోలు చేశారు అనే వివరాల వంటి వివిధ ప్రమాణాలను విశ్లేషించడంలో ఈ ప్రాథమిక ప్రణాళిక తోడ్పడుతుంది.
ఇంత కన్నా ముఖ్యమైన విషయం.. ఈ ప్రాథమిక ప్రణాళిక ఎరువుల కొనుగోలు ప్రక్రియలో మరింత పారదర్శకత్వాన్ని, డేటా ఆధారిత పర్యవేక్షణను సమకూరుస్తుంది. ఫలితంగా అసలైన రైతులు తమ అంచనాల మేరకు అవసరాలను బట్టి ఎరువులను కొనుగోలు చేసి, వినియోగించ గలుగుతారు. ఈ విధమైన విశ్లేషణ ఒక్క వ్యక్తిగత లావాదేవీల పర్యవేక్షణకు మాత్రమే పరిమితం కాకుండా, అంతకు మించి.. వ్యవసాయ నేపథ్యంలో ఎరువుల ఉపయోగాన్ని అర్థం చేసుకొనే దిశలో ముఖ్య నిర్ణయానికీ దోహదం చేస్తుంది.
ఎరువుల రాకపోకలకు సంబంధించిన డిజిటల్ మాధ్యమ పర్యవేక్షణ బలోపేతం
వాహనం జాడను పసిగట్టే వ్యవస్థ (వెహికిల్ లొకేషన్ ట్రాకింగ్ సిస్టమ్.. వీఎల్‌టీఎస్) కార్యక్రమం ద్వారా ఎరువుల రాక, పోకలకు సంబంధించిన డిజిటల్ పర్యవేక్షణను బలోపేతం చేశారు.
సరఫరా వ్యవస్థలో ఎరువుల రాక, పోకల స్థితికి మరింత పారదర్శకత్వాన్ని సంతరించడానికే వీఎల్‌టీఎస్‌ను తీసుకువచ్చారు. పంపిన సరుకు సమాచారాన్ని, వాహనం దారిలో ఏ నిర్దిష్ట స్థానంలో ఉందన్న సమాచారానికి జోడించడం ద్వారా ఎరువు కన్‌సైన్‌మెంట్లు రవాణా దశలో ఉండగా వాటిని పర్యవేక్షించగల సౌలభ్యాన్ని కల్పించారు. ఆలస్యాలను, రాకపోకల్లో అసాధారణ పరిస్థితులను గుర్తించడంలోనూ వీఎల్‌టీఎస్ సహాయపడుతుంది.
ఐఎఫ్ఎమ్ఎస్‌లో ముందుగానే అందుబాటులో ఉన్న డిస్పాచ్, స్టాక్ సంబంధిత సమాచారం.. వీటికి ‘సరుకు మార్గమధ్యంలో ఉందన్న స్థితి’ (గూడ్స్-ఇన్-ట్రాన్సిట్) కూడా తోడయితే, సరుకును పంపించిన స్థానం (డిస్పాచ్ పాయింట్) నుంచి నిర్దేశిత గమ్యస్థానం వరకు ఎరువు రాక, పోకల తాలూకు సమగ్ర డిజిటల్ చిత్రాన్ని ఈ వీఎల్‌టీఎస్ నిర్వాహకులకు అందుబాటులోకి తెస్తుంది.
దీంతో .. ఎంత మొత్తంలో ఎరువులను తరలించారు ?, ఆ సరుకు సరఫరా వ్యవస్థ మార్గంలో ఏ స్థానంలో ఉన్నది?, అది చేరవలసిన గమ్యస్థానాన్ని ఎప్పటికి చేరుకోగలుగుతుంది? వగైరా అంశాలన్నీ ఎరువుల విభాగం తెలుసుకునే శక్తీ, ఆయా దశలను పర్యవేక్షించే సామర్థ్యం పెంపొందుతాయి.
పారదర్శకతను, ఆడిట్ సామర్థ్యాన్ని పెంపొందింపచేయనున్న
ఎలక్ట్రానిక్ మాధ్యమ ఆధారిత సబ్సిడీ ప్రాసెసింగ్ ప్రక్రియ
ఎరువుల సబ్సిడీ ప్రక్రియ నిర్వహణలోనూ ఐఎఫ్ఎమ్ఎస్ ముఖ్య పాత్రను పోషిస్తోంది. ఇది సబ్సిడీ చెల్లింపులను, పీఓస్ వ్యవస్థ (నెట్‌వర్క్) ద్వారా నమోదైన అసలైన ఎరువుల విక్రయాల సమాచారంతో జోడిస్తున్నది.
సబ్సిడీ బిల్లులను ఎలక్ట్రానిక్ ప్రాసెసింగ్ వ్యవస్థతోనూ, పీఎఫ్ఎమ్ఎస్, ఇ- బిల్ (e-Bill) సహా ఆర్థిక వ్యవస్థలతో ఏకీకరించే దిశగా 2026 జనవరి 1న మరో ముందడుగు వేశారు. పనితీరులో డిజిటలీకరణను ప్రవేశపెట్టిన కారణంగా మనిషి ప్రమేయం తగ్గి, గుర్తించే సామర్థ్యం (ట్రేసబులిటీ) మెరుగుపడడంతో పాటు, సబ్సిడీ క్లెయిములు, చెల్లింపులకు సంబంధించిన వివిధ దశలను ఎలక్ట్రానిక్ విధానంలో పర్యవేక్షించడం కూడా సాధ్యపడుతుంది.
ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్.. డీబీటీ)తో ముడిపడిన బిల్లులు, లావాదేవీల పరిశీలనను బలపరచడానికి ర్యాండమ్ వెరిఫికేషన్ పద్ధతులు, అదనపు విశ్లేషణాత్మక తనిఖీలను కూడా ప్రవేశపెడుతున్నారు. సబ్సిడీ ప్రాసెసింగును మరింత పకడ్బందీగా తీర్చిదిద్దడం, దాంతో పాటు డిజిటల్ మాధ్యమ ప్రధాన నియంత్రణను, ఆడిట్‌ను పటిష్ఠపరచడం ఈ కార్యక్రమాల ముఖ్యోద్దేశం.
ఎరువుల నిర్వహణకు ఏకీకృత డిజిటల్ వేదికగా రూపొందుతున్న ఐఎఫ్ఎమ్ఎస్
చేపట్టిన చర్యలు ఐఎఫ్ఎమ్ఎస్ రంగంలో కీలక మార్పు చోటుచేసుకొందని తెలియజేస్తున్నాయి. మౌలికంగా ఎరువుల రాక పోకలను, విక్రయాలను, సబ్సిడీకి సంబంధించిన లావాదేవీలను నిర్వహించడానికి ఉద్దేశించిన ఈ వ్యవస్థ.. ప్రస్తుతం భారత్ ఎరువుల విస్తారిత అనుబంధ వ్యవస్థలో వివిధ ఆసక్తిదారులను, డేటాసెట్లను జోడిస్తూ ఏకీకృత డిజిటల్ వేదికగా వేగవంతమైన మార్పుచేర్పులకు కేంద్రస్థానంగా నిలుస్తోంది.
ఉత్పత్తి, దిగుమతులు, ఆధునిక వస్తు రవాణా వ్యవస్థ (లాజిస్టిక్స్), నిల్వలు, రైతుకూ, భూమికీ సంబంధించిన సమాచారం, ఎరువుల బుకింగు, రిటైల్ లావాదేవీలతో పాటు సబ్సిడీ ప్రాసెసింగు.. వీటి ఏకీకరణ జోరందుకొంటుండడంతో పాటే మెరుగుపరిచిన డ్యాష్‌బోర్డులు, విశ్లేషణాత్మక సామర్థ్యాలు విధాన రూపకర్తలకు ఎరువుల పరిస్థితిని గురించి మరింత విస్తృత, కాలబద్ధ వివరణలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి.
రైతుకు సంబంధించిన, భూమికి సంబంధించిన సమాచార ఏకీకరణ మొదలు ఎమ్ఎఫ్ఎమ్‌బీ, ‘అగ్రీస్టాక్’ వేదికల ద్వారా ఎరువుల విక్రయాలను, వాహనాల కదలికలను పసిగట్టగలగడం, మెరుగైన విశ్లేషణలతో పాటు ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా సబ్సిడీ ప్రాసెసింగ్ వరకూ చోటు చేసుకున్న పురోగతి ఐఎఫ్ఎమ్ఎస్ పోషిస్తున్న పాత్ర గణనీయంగా మారిందని సూచిస్తోంది.
లావాదేవీల నమోదుకు మాత్రమే సాంకేతిక విజ్ఞానం ఉపయోగాన్ని పరిమితం చేయకుండా, ఎరువులు ఎక్కడ అందుబాటులో ఉన్నాయి?, ఎరువులను ఎలాగ ఒక చోటు నుంచి వేరే చోట్లకు పంపిస్తున్నారు?, ఎరువులను కొనుగోలు చేస్తున్న వర్గాలు ఏవేవి?, ఎరువులను ఎంత మేరకు వినియోగిస్తున్నారు?, ఈ నమూనాలు వ్యవసాయ సంబంధిత అవసరాలతో ఎలాగ ముడిపడుతున్నాయనే విషయాలను తెలుసుకోవడానికి కూడా సాంకేతిక విజ్ఞానాన్ని విరివిగా ఉపయోగిస్తున్నారు.
భారత్‌లో ఎరువులు అత్యంత ప్రాధాన్య వ్యావసాయిక ముడిపదార్థాల్లో ఒకటి. సకాలంలో ఎరువుల లభ్యతను నిర్ధారించడం, పారదర్శకత్వాన్ని పెంపొందింప చేయడంతో పాటు ఎరువుల నిర్వహణ తీరుతెన్నులను ఇదివరకటితో పోలిస్తే ఎక్కువ డేటా ఆధారిత నిర్వహణ యోగ్యమైందిగా మార్చడానికి విశ్వసనీయ డిజిటల్ సమాచార వినియోగాన్ని పైన ప్రస్తావించిన పరిణామ క్రమం పటిష్ఠపరుస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2304954)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13