సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మాదకద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక అవగాహన బలోపేతం లక్ష్యంగా మూడు లఘు చిత్రాలను ఖరారు చేసిన మంత్రిత్వశాఖ

ముందస్తు హెచ్చరిక సంకేతాలు, జాతీయ వ్యసన విముక్తి హెల్ప్‌లైన్ 14446 సహా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్రను వివరించనున్న వీడియోలు

మాదకద్రవ్య రహిత సమాజాన్ని ప్రోత్సహించే 'నషా ముక్త్ భారత్ అభియాన్' లక్ష్యానికి మద్దతునిస్తున్న కార్యక్రమం

నాడు పోస్టు చేయడమైనది: 27 AUG 2026 5:14PM by PIB Hyderabad

దేశంలో మాదకద్రవ్యాల డిమాండ్ తగ్గింపు కోసం నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ... మాదకద్రవ్యాల దుర్వినియోగం, దాని దుష్ప్రభావాల గురించి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతీది 60 సెకన్ల నిడివి గల మూడు లఘు చిత్రాలను ఖరారు చేసింది.

మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి సాధారణ ప్రజలకు అవగాహన కల్పిస్తూ, వారిని జాగృతం చేయడం లక్ష్యంగా కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత విభాగం “మాదకద్రవ్యాల డిమాండ్ తగ్గింపు కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళిక (ఎన్ఏపీడీడీఆర్)”ను అమలు చేస్తోంది.

సామాజిక న్యాయం, సాధికారత విభాగం ఈ పథకం కింద 2020 ఆగస్టు 15న 'నషా ముక్త్ భారత్ అభియాన్' (ఎన్ఎంబీఏ)ను ప్రారంభించింది. మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడం, మాదకద్రవ్య రహిత సమాజాన్ని ప్రోత్సహించడం ఈ ప్రధాన ప్రచార కార్యక్రమం లక్ష్యం.

ప్రజా చైతన్యాన్ని పెంపొందించే లక్ష్యంతో, కింది అంశాలపై మూడు లఘు చిత్రాలను మంత్రిత్వ శాఖ ఖరారు చేసింది:

1.  తోటివారి ఒత్తిడితో సహా, మాదకద్రవ్యాల వాడకంతో సంబంధం ఉన్న ముందస్తు హెచ్చరిక సంకేతాలు, ప్రవర్తనలో మార్పులను అర్థం చేసుకోవడం.

2.  జాతీయ వ్యసన విముక్తి – టెలి కౌన్సెలింగ్ హెల్ప్‌లైన్ —14446.

3.  మాదకద్రవ్యాల వినియోగాన్ని ప్రారంభ దశలోనే గుర్తించడం, నివారించడం, చికిత్స అందించడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర.

మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా అవగాహనను బలోపేతం చేయడం... సకాలంలో జోక్యం చేసుకోవడాన్ని ప్రోత్సహించడం... కుటుంబాలు, విద్యా సంస్థలు, సమాజాలు సమష్టిగా చర్యలు చేపట్టేలా స్ఫూర్తినివ్వడం ఈ చిత్రాల ప్రధాన ఉద్దేశం.

ఈ వీడియోలను కింది గూగుల్ లింక్ ద్వారా చూడవచ్చు:


(రిలీజ్ ఐడి: 2303970) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Urdu , English , हिन्दी , Tamil , Kannada