ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఓనం సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు

నాడు పోస్టు చేయడమైనది: 26 AUG 2026 9:58AM by PIB Hyderabad

ఓనం పండగ సందర్భంగా ప్రజలందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఓనం పండగ కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంతో జరుపుకునే పండగ అని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ పండగ సమాజంలో సంతోషం, ఐక్యత, శ్రేయస్సుల స్ఫూర్తిని మరింత బలోపేతం చేయాలని ఆయన ఆకాంక్షించారు.

‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

"ఓనం పండగ శుభాకాంక్షలు. ఇది ప్రపంచవ్యాప్తంగా అపారమైన ఉత్సాహంతో జరుపుకొనే శక్తిమంతమైన పండుగ.

ఇది సంతోషం, ఐక్యత, శ్రేయస్సుల స్ఫూర్తిని మరింత బలోపేతం చేయాలని ఆశిస్తున్నా”.

 

***


(రిలీజ్ ఐడి: 2303433) సందర్శకుల సూచీ సంఖ్య : : 46