రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

దేశీయ తయారీ బలోపేతం... డీఆర్‌డీవో క్షిపణి సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత రక్షణ పరిశ్రమకు బదిలీ చేయడానికి రక్షణ మంత్రి ఆమోదం

నాడు పోస్టు చేయడమైనది: 25 AUG 2026 1:02PM by PIB Hyderabad

రక్షణ రంగంలో ఆత్మనిర్భరత లక్ష్యాన్ని సాధించే దిశగా ముందడుగు వేస్తూ... దేశంలోనే ఉత్పత్తి చేయడానికి వీలు కల్పించేలా డీఆర్‌‌డీవో అభివృద్ధి చేసిన అన్ని సంప్రదాయ క్షిపణి వ్యవస్థల సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత రక్షణ పరిశ్రమకు బదిలీ చేయడానికి రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. నిర్దేశిత అర్హతలు, ధ్రువీకరణలు, నియంత్రణ అవసరాలకు అనుగుణంగా దేశీయంగా ఉత్పత్తిని చేపట్టే, రక్షణ రంగంలో స్వదేశీ పరిశ్రమల భాగస్వామ్యాన్ని పెంపొందించే ముఖ్యమైన కార్యక్రమంగా ఈ సాంకేతిక పరిజ్ఞాన బదిలీ నిలిచిపోతుంది.

క్షిపణి వ్యవస్థ అభివృద్ధిని పారిశ్రామిక ఉత్పత్తి దశకు విజయవంతంగా తీసుకురావడానికి ఈ నిబంధన వీలు కల్పిస్తుంది. అలాగే అధునాతన రక్షణ వ్యవస్థల అభివృద్ధికీ, తయారీకీ భారతీయ పరిశ్రమ సామర్థ్యాలను వినియోగించుకోవడానికి డీఆర్‌డీవో చేస్తున్న నిరంతర ప్రయత్నాలను ప్రతిబింబిస్తుంది. దేశీయ తయారీ సామర్థ్యాలను విస్తరించడం, రక్షణ పారిశ్రామిక పునాదులను బలోపేతం చేయడం, సరఫరా వ్యవస్థల్లో దేశీయ ఎంఎస్ఎంఈలు, సాంకేతిక భాగస్వామ్యులు పాల్గొనేందుకు అవకాశాలను కల్పించడమే దీని లక్ష్యం.

కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, దేశీయంగా విలువను పెంచడంతో పాటు భారత రక్షణ ఉత్పాదక రంగం వృద్ధికి తోడ్పడటమే ఈ కార్యక్రమ లక్ష్యం. అధునాతన రక్షణ పరిజ్ఞాన బదిలీ, వినియోగాన్ని సులభతరం చేయడానికీ, దేశీయ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికీ భారత పరిశ్రమ రంగంతో కలసి పనిచేసేందుకు డీఆర్‌డీవో కట్టుబడి ఉంది.

 

***


(రిలీజ్ ఐడి: 2303064) సందర్శకుల సూచీ సంఖ్య : : 71
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Gujarati , Odia , Tamil , Kannada