హోం మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగే 9వ జాతీయ భద్రతా వ్యూహాల (ఎన్‌ఎస్‌ఎస్) సదస్సు-2026ను ప్రారంభించిన కేంద్ర హోం, సహకారశాఖ మంత్రి శ్రీ అమిత్ షా
నాడు పోస్టు చేయడమైనది:
24 AUG 2026 9:40PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగే 9వ జాతీయ భద్రతా వ్యూహాల (ఎన్‌ఎస్‌ఎస్) సదస్సు-2026ను ఇవాళ కేంద్ర హోం, సహకారశాఖ మంత్రి శ్రీ అమిత్ షా ప్రారంభించారు.
సదస్సు ప్రారంభానికి ముందుగా... అమరవీరుల స్థూపం వద్ద కేంద్ర మంత్రి నివాళులు అర్పించారు. దేశ భద్రత, సమగ్రతను పరిరక్షించేందుకు విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన ఇంటెలిజెన్స్ బ్యూరో సిబ్బందిని స్మరించుకున్నారు.
దేశవ్యాప్తంగా 850 మందికి పైగా ప్రతినిధులు హాజరైన ఈ సదస్సును హైబ్రిడ్ విధానంలో నిర్వహించారు. ఢిల్లీలో జరిగిన ఈ సదస్సులో కేంద్ర హోం వ్యవహారాల సహాయమంత్రులు, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, డిప్యూటీ ఎన్ఎస్ఏలు, సీఏపీఎఫ్‌లు, సీపీఓ అధిపతులు హాజరయ్యారు. వివిధ రాష్ట్రాలు, యూటీల డీజీపీలు, క్షేత్రస్థాయిలో పని చేసే పోలీసు అధికారులు, పలు ప్రత్యేక రంగాలకు చెందిన నిపుణులు వర్చువల్ విధానంలో ఈ సదస్సులో పాల్గొన్నారు.
సమావేశం మొదటి రోజున జాతీయ భద్రతకు సంబంధించిన కీలక అంశాలపై చర్చలుంటాయి. ఇందులో ఉగ్రవాద వ్యతిరేక సవాళ్లకు ప్రతిస్పందన, వివిధ ఏజెన్సీల ద్వారా అందే నిఘా సమాచారం, విశ్లేషణ, కార్యాచరణ, మాదకద్రవ్యాల నియంత్రణకు డాక్యుమెంట్, అక్రమ వలసదారుల గుర్తింపు, బహిష్కరణ, సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు విధానపరమైన వ్యవస్థ, పాకిస్తాన్ ప్రచ్ఛన్న యుద్ధం వంటి అంశాలున్నాయి.
ఉగ్రవాదం, తీవ్రవాద భావాజాలాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పలు కీలక అంశాలపై దృష్టి సారించాలని కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా స్పష్టం చేశారు. ఎంహెచ్‌ఏ ప్రహార్ పథకం అమలు కోసం తగిన శిక్షణ ఇవ్వటం, పరారీలో ఉన్న నిందితులు వెనక్కి రప్పించటం ద్వారా విచారణను వేగవంతం చేయటం, గైర్హాజరీలో విచారణ నిబంధనలను ఉపయోగించటం, యూఏపీఏ కేసులను దర్యాప్తు చేసేప్పుడు సమగ్ర, సమీకృత విధానాన్ని అనుసరించటం, వివిధ జాతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కోవటానికి ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను (ఎస్‌ఓపీలు) రూపొందించేందుకు ఎంఏసీ వేదికల్లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఏఐ ఆధారంగా విశ్లేషించాలని హోంమంత్రి సూచించారు. అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని ఏజెన్సీలను ఆదేశించారు.
సబ్ ఏరియల్ వ్యవస్థల నుంచి ముప్పు, వాటికి వ్యతిరేకంగా తీసుకోవాల్సిన నివారణ చర్యలు, బ్లూ ఎకానమీ, భద్రత, ఇన్ఫర్మేషన్ వార్‌ఫేర్, జాతీయ భద్రతపై ప్రభావాలు, బయో-సెక్యూరిటీ వ్యవస్థ అవసరం వంటి అంశాలపై రెండో రోజు సమావేశంలో చర్చిస్తారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారుల అనుభవాన్ని, సంబంధిత నిపుణుల సహకారాన్ని జోడించి జాతీయ భద్రతా సవాళ్లకు పరిష్కారాలు కనుగొనాలనే ఉద్దేశంతో 2021 నుంచి ఏటా హైబ్రిడ్ విధానంలో ఎన్‌ఎస్‌ఎస్‌సీని నిర్వహిస్తున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2303003)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9