పార్లమెంటరీ వ్యవహారాలు
azadi ka amrit mahotsav

‘2025-26 సంవత్సరానికి గాను 58వ యూత్ పార్లమెంట్ పోటీ’ బహుమతుల ప్రదాన కార్యక్రమం


ఢిల్లీ ఎన్‌సీటీ ప్రభుత్వ విద్యా డైరెక్టరేట్, ఎన్‌డీఎమ్‌సీ విద్య విభాగ పరిధిలోని పాఠశాలలకు నిర్వహించిన పోటీ

प्रविष्टि तिथि: 24 AUG 2026 12:56PM by PIB Hyderabad

ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (ఎన్‌సీటీ) ప్రభుత్వ విద్య డైరెక్టరేట్‌తో పాటు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్‌డీఎమ్‌సీ) విద్య విభాగ అధికార పరిధిలోని పాఠశాలలకు ‘2025-26 సంవత్సరానికి నిర్వహించిన 58వ యూత్ పార్లమెంట్ పోటీ’ బహుమతుల ప్రదానం కార్యక్రమాన్ని రేపు.. అంటే 2026 ఆగస్టు 25న ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని న్యూఢిల్లీ పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో గల పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగు.. జీఎమ్‌సీ బాలయోగి సభాభవనంలో నిర్వహించనున్నారు.

 


ఈ కార్యక్రమానికి కేంద్ర చట్ట, న్యాయ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్‌వాల్ అధ్యక్షత వహించి, పోటీలో ప్రతిభాపాటవాలను కనబరిచిన పాఠశాల విద్యార్థులకు బహుమతులను అందజేస్తారు. ఈ సందర్భంగా,  ఢిల్లీ పీతంపురా పర్వానా రోడ్డు ప్రాంతంలో గల బాల భారతి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ‘‘యూత్ పార్లమెంట్ సిటింగ్’’ను పునఃప్రదర్శించనున్నారు. ‘2025-26 సంవత్సరానికి 58వ యూత్ పార్లమెంట్ పోటీ’ని ఢిల్లీ ఎన్‌సీటీ ప్రభుత్వ విద్యా డైరెక్టరేట్, ఎన్‌డీఎమ్‌సీ విద్య విభాగ పరిధిలోని పాఠశాలల విద్యార్థులకు నిర్వహించగా, బాల భారతి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు  ప్రథమ స్థానంలో   నిలిచారు.
ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (ఎన్‌సీటీ) లోని పాఠశాలలకు యూత్ పార్లమెంట్ పోటీలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ గత 60 సంవత్సరాలుగా నిర్వహిస్తోంది.  ఢిల్లీ ఎన్‌సీటీ ప్రభుత్వ విద్య డైరెక్టరేట్‌తో పాటు ఎన్‌డీఎమ్‌సీ విద్య విభాగ అధికార పరిధిలోని పాఠశాలలకు యూత్ పార్లమెంట్ పోటీ కార్యక్రమంలో భాగంగా  ఈ సిరీస్ లోని 58వ పోటీని 2025-26 సంవత్సరానికి గాను ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ టెరిటరీలో ఏర్పాటు చేశారు.
యువతరంలో స్వీయ క్రమశిక్షణ, వివిధ అభిప్రాయాలను ఆదరించడం, అభిప్రాయాలను పక్షపాత రహితంగా తెలియజేయడం, ప్రజాస్వామిక మార్గాల్లో జీవించే విధానం, తదితర సద్గుణాలను పెంపొందింప చేయడమే ఈ యూత్ పార్లమెంట్ పథకం ముఖ్యోద్దేశం. దీనికి తోడు, పార్లమెంట్ పద్ధతులు, ప్రక్రియలు, చర్చ, వాదోపవాదాల మెలకువలను  విద్యార్థులకు  ఈ పథకం పరిచయం చేస్తుంది. అలాగే వారిలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ సామర్థ్యం, చెప్పదలుచుకున్న విషయాలను ప్రభావవంతంగా చెప్పే కళ, నేర్పు.. వీటిని కూడా అలవరుస్తుంది.
పోటీలో ఢిల్లీ పీతంపురా పర్వానా రోడ్డు ప్రాంతంలోని బాల భారతి పబ్లిక్ స్కూలు ప్రథమ స్థానంలో నిలిచినందున ఆ స్కూలుకు జీవీ మావలంకర్ పార్లమెంటరీ షీల్డును, ట్రోఫీని అందజేస్తారు. పోటీలో మొదటిసారి పాల్గొన్న పాఠశాలల్లో ప్రథమ స్థానం దక్కించుకున్న స్కూలుకు ఇచ్చే ట్రోఫీని కూడా ఢిల్లీ పీతంపురా పర్వానా రోడ్డు ప్రాంతంలోని బాల భారతి పబ్లిక్ స్కూలుకే ఇస్తున్నారు. పోటీలో శ్రేష్ఠ ప్రదర్శనలిచ్చిన ఈ కింది 11 పాఠశాలలకు మెరిట్ ట్రోఫీలను ఇవ్వనున్నారు.

 

క్రమ సంఖ్య

పాఠశాల పేరు

1

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సీఎమ్ శ్రీ స్కూలు, ద్వారకా సెక్టర్-22, ఢిల్లీ

2

నవయుగ స్కూలు, పేష్వా రోెడ్డు, న్యూఢిల్లీ

3

ప్రజెంటేషన్ కాన్వెంట్ సీనియర్ సెకండరీ స్కూలు, ఎస్.పి. ముఖర్జీ మార్గ్, ఢిల్లీ   

4

బాబా నీమ్ కరోలీ సర్వోదయ కన్యా విద్యాలయ (బీఎన్‌కేఎస్‌కేవీ), జోనాపూర్, న్యూఢిల్లీ

5

సర్వోదయ కన్యా విద్యాలయ, ప్రహ్లాద్‌పూర్, ఢిల్లీ

6

ప్రభుత్వ సర్వోదయ బాల విద్యాలయ నెం.1 (ఉర్దూ మీడియమ్), జామా మసీదు, న్యూఢిల్లీ

7

అటల్ ఆదర్శ్ విద్యాలయ, గోల్ మార్కెట్, న్యూఢిల్లీ

8

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సీఎమ్ శ్రీ స్కూల్, సెక్టర్ 17, రోహిణి, ఢిల్లీ

9

సర్వోదయ కన్యా విద్యాలయ నెం.1, యమునా విహార్, సి-బ్లాక్, ఢిల్లీ

10

ఈశానీ సర్వోదయ కన్యా విద్యాలయ, జి-బ్లాక్ సాకేత్, న్యూఢిల్లీ

11

కేరళ సీనియర్ సెకండరీ స్కూల్, వికాస్‌పురి, న్యూఢిాల్లీ

 

***


(रिलीज़ आईडी: 2302825) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Gujarati , Tamil