ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కరుణ, సంతృప్తి ప్రధానమని చెప్పే ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రస్తావించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 24 AUG 2026 8:08AM by PIB Hyderabad

కరుణ ఆత్మగౌరవాన్ని, సంతృప్తి సిసలైన ఆనందాన్ని అందిస్తాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ వైఖరిని అనుసరించడం వల్ల సమాజంలో సహకార, సద్భావన బంధాలు బలోపేతం అవుతాయని కూడా ఆయన అన్నారు.
‘‘కారుణ్యేనాత్మనో మానం తృష్ణాం చ పరితోషతః, ఉత్థానేన జయేత్తన్ద్రీం వితర్కం నిశ్చయాజ్జయేత్’’ అనే ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు.
పరుల పట్ల దయను గాని, లేదా కరుణను గాని చూపినప్పుడు ఆత్మగౌరవం సిద్ధిస్తుంది. జీవితంలో ఉన్న దానితో సంతృప్తి చెందితే లోభంపై పైచేయిని సాధించవచ్చు. సోమరితనం, అనుమానాలకు తావునిచ్చే తర్కం, నిర్ణయం తీసుకోలేక పోవడం.. వీటిపై ప్రయత్నాలతో, కష్టపడి పనిచేయడం ద్వారా విజయాన్ని పొందవచ్చునని  మనకు ఈ సుభాషితం బోధిస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘కరుణతో ఆత్మగౌరవం, సంతోషంతో సిసలైన ఆనందం లభిస్తాయి. ఈ భావనలతో సమాజంలో సహకారం, సద్భావనల బంధాలు బలోపేతమవుతాయి.
కారుణ్యేనాత్మనో మానం తృష్ణాం చ పరితోషతః,
ఉత్థానేన జయేత్తన్ద్రీం వితర్కం నిశ్చయాజ్జయేత్’’ అని పేర్కొన్నారు.


(రిలీజ్ ఐడి: 2302634) సందర్శకుల సూచీ సంఖ్య : : 49