పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మైసూరులో పౌర విమానయాన శాఖ సలహా కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు


ఉడాన్ పథకం తదుపరి దశ, పైలట్ శిక్షణ వ్యవస్థ బలోపేతంపై చర్చించిన కమిటీ

నాడు పోస్టు చేయడమైనది: 21 AUG 2026 7:04PM by PIB Hyderabad

కర్ణాటకలోని మైసూరులో పౌర విమానయాన మంత్రిత్వశాఖ పార్లమెంటరీ సలహా కమిటీ సమావేశం ఈ రోజు జరిగిందికేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో... కేంద్ర పౌర విమానయానసహకార శాఖ సహాయ మంత్రి శ్రీ మురళీధర్ మోహోల్ పాల్గొన్నారు.

పార్లమెంటు సభ్యులు శ్రీ గోపాల్ జీ ఠాకూర్ (దర్భంగాబీహార్)... శ్రీ అనూప్ సంజయ్ ధోత్రే (అకోలామహారాష్ట్ర)... శ్రీమతి సయానీ ఘోష్ (జాదవ్‌పూర్పశ్చిమ బెంగాల్)... శ్రీ కామాఖ్య ప్రసాద్ తాసా (కాజిరంగాఅస్సాం)... డాక్టర్ ఎంధనపాల్ (రాజ్యసభతమిళనాడు)... శ్రీ రామ్‌రావు సఖారం వాడ్‌కుటే (రాజ్యసభమహారాష్ట్ర)... మైసూర్ ఎంపీ శ్రీ యదువీర్ చామరాజ వడియార్‌ ఈ సమావేశానికి హాజరయ్యారు.

పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు అధ్యక్షతన... చర్చలను ఆయా ప్రాంతాలకు మరింత చేరువ చేసే ప్రభుత్వ విధానానికి అనుగుణంగాఆ శాఖకు చెందిన పార్లమెంటరీ సలహా కమిటీ 2017 తర్వాత తొలిసారిగా ఢిల్లీ వెలుపల సమావేశమైందిమైసూరులో జరిగిన ఈ సమావేశంలో, 'ఉడాన్పథకం తదుపరి దశఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ వ్యవస్థలో సంస్కరణలుఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ పరివర్తన వంటి అంశాలపై కమిటీ చర్చించింది.

కమిటీని ఉద్దేశించి శ్రీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ... భారత విమానయాన రంగ వృద్ధి ప్రధాన గమ్యస్థానాలకు మించివిమానాశ్రయాల అభివృద్ధికి మించి విస్తరిస్తోందని అన్నారు. "ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత అయిన 'ఉడాన్ద్వారావిమానయాన రంగ ప్రాంతీయ అభివృద్ధికిసమ్మిళిత ఆర్థిక వృద్ధికి చోదక శక్తిగా మారుతోందిదీని ద్వారా రైతులుఎగుమతిదారులువ్యాపారులుసమాజాలూ లబ్ధి పొందుతున్నాయిఎమ్ఆర్‌వోఎయిర్ కార్గో వంటి రంగాల్లో సంస్కరణలను ముందుకు తీసుకువెళ్తూ... డ్రోన్లుఈవీటీవోఎల్‌ల ద్వారా భారత విమానయాన ఆవిష్కరణల తదుపరి దశకు ఇది నాయకత్వం వహిస్తోందిఅని ఆయన పేర్కొన్నారు.

ఉడాన్ పథకం ద్వారా వచ్చిన మార్పులను వివరిస్తూ “గత పదేళ్లలోమేం విమానాశ్రయాల అభివృద్ధికివిమానయాన సంస్థలకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కోసం సుమారు రూ. 10,000 కోట్లు పెట్టుబడి పెట్టాంఇప్పుడు ఉడాన్ తదుపరి దశ కింద అపూర్వమైన రీతిలో రూ. 28,840 కోట్లు కేటాయించడం ద్వారా ఈ లక్ష్యాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నాం అని కేంద్ర మంత్రి తెలిపారు. భద్రతశిక్షణలో ఉన్నత ప్రమాణాలను పాటిస్తూనేశిక్షణ పొందిన పైలట్ల లభ్యతను పెంచడానికి ఎఫ్‌టీవో వ్యవస్థలో చేపట్టిన సంస్కరణలనూ ఆయన కమిటీకి వివరించారు.

ఎఫ్‌టీవో వ్యవస్థ 2020లో ఉన్న 32 ఎఫ్‌టీవోల నుంచి 2026 నాటికి 41కి విస్తరించింది. ఫ్లయింగ్ బేస్‌ల సంఖ్య 32 నుంచి 63కి పెరిగిందికేంద్ర మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు ఆదేశాల మేరకు ప్రారంభించిన ఎఫ్‌టీవో ర్యాంకింగ్ విధానం... ఎఫ్‌టీవోల పనితీరులో పారదర్శకతనుజవాబుదారీతనాన్ని కల్పించింది. దీని ద్వారా యువత తమ పైలట్ కెరీర్ ప్రారంభ దశలోనే సరైన అవగాహనతో నిర్ణయం తీసుకునే అవకాశం ఏర్పడింది.

విమానయాన రంగంలోని అవకాశాలను ప్రస్తావిస్తూ "ప్రపంచంలోనే ఎక్కడా లేనంత భారీ స్థాయిలో భారతీయ విమానయాన సంస్థలు విమానాల కోసం ఆర్డర్లు ఇచ్చాయివిమానాల ఆర్డర్లు ఒక అంశం మాత్రమేవాటిని నడపడానికి నైపుణ్యంభద్రత పట్ల అవగాహన కలిగిన సిబ్బంది ఎంతో అవసరంభారత విమానయాన రంగ వృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన సిబ్బందిని మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని అనుకోవడం లేదుదాని కోసం అవసరమైన సిబ్బందికి ఇక్కడేమన దేశంలోనే శిక్షణనివ్వాలని మేం కోరుకుంటున్నాంఅని కేంద్ర మంత్రి వెల్లడించారు.

విమానాల వినియోగంలో గణనీయ వృద్ధితో... అంటే ఒక్కో విమానం సగటున ఏడాదికి 1,765 గంటల పాటు ఎగరడం ద్వారా (ఇది సుమారు 1,500 గంటల ప్రపంచ స్థాయి ప్రమాణం కంటే ఎక్కువ'ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ'లో వచ్చిన మార్పుల గురించి కమిటీ చర్చించిందిరెండు దశాబ్దాలకు పైగా వరుసగా లోటును ఎదుర్కొన్న తర్వాతఈ సంస్థ తొలిసారిగా మిగులు బడ్జెట్టును సాధించింది.

పౌర విమానయాన శాఖ కార్యదర్శి శ్రీ సమీర్ కుమార్ సిన్హాడీజీసీఏ డైరెక్టర్ జనరల్ శ్రీ వీర్ విక్రమ్ యాదవ్ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ శ్రీ విపిన్ కుమార్బీసీఏఎస్ డైరెక్టర్ జనరల్ శ్రీ రాజేష్ నిర్వాన్ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరైన ఎంపీలకు వివరాలను అందించారు. విలువైన సూచనలను అందించినందుకు సభ్యులను కేంద్ర మంత్రి అభినందించారుపౌర విమానయాన రంగాన్ని నిరంతరం వృద్ధి చేసేఅభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే చర్యలను చేపట్టేటప్పుడు ఈ సూచనలను తప్పక పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.

***


(రిలీజ్ ఐడి: 2302226) సందర్శకుల సూచీ సంఖ్య : : 34
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil , Kannada