కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆరోగ్య సంరక్షణ, వైద్య విద్యకు అంకితం ‘వికసిత్ భారత్’ను నిజం చేస్తున్న ఈఎస్ఐసీ

దేశానికి 4,961 మంది వైద్యులను అందించిన ఈఎస్ఐసీ వైద్య విద్యా సంస్థలు

అందులో...1,682 మంది కార్మికుల పిల్లలు

प्रविष्टि तिथि: 20 AUG 2026 4:22PM by PIB Hyderabad

‘వికసిత్ భారత్’ దిశగా ముందుకు సాగే క్రమంలోకార్మికులకు సామాజిక భద్రతపరంగా వెసులుబాటును కల్పించడం ఆరోగ్యవంతమైనదృఢమైనసురక్షిత దేశ నిర్మాణానికి తప్పనిసరిభారతదేశ పురోగతికి మన శ్రామికులే అసలైన చోదకశక్తులువారి సంక్షేమంఆత్మగౌరవంశ్రేయస్సుపై  కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీదృష్టి కేంద్రీకరించింది. 169 ఆస్పత్రులు, 1,603 డిస్పెన్సరీలు, 17 వైద్య కళాశాలలు, 2 దంతవైద్య కళాశాలలు, 2 నర్సింగ్ కళాశాలలు, 3 పారామెడికల్ కళాశాలల ద్వారా లబ్ధిదారులకు నగదు ప్రయోజనాలే కాకుండాఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తోంది. 65 ప్రాంతీయఉప ప్రాంతీయ కార్యాలయాలు, 612 బ్రాంచ్ ఆఫీసులు, 117 డిస్పెన్సరీకమ్బ్రాంచ్ ఆఫీసులు తమ వంతు సేవలను అందిస్తున్నాయిఈఎస్ఐ పథకాన్ని ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 787 జిల్లాలకు గాను 728 జిల్లాల్లో అమలు చేస్తున్నారువైద్యసామాజిక ప్రయోజనాలను అందిస్తూ నైపుణ్య సాధనకు తోడ్పడడంసేవలను అందించడంకారుణ్య దృక్పథ ప్రధాన కార్యక్రమాల నిర్వహణపై ఈఎస్ఐసీ శ్రద్ధ వహిస్తూవైద్య విద్య బోధనపై పెట్టుబడి పెడుతోంది.
కొత్తగా 75,000 మెడికల్ సీట్లను ఏర్పాటు చేయాలని భారత్ సంకల్పించిన నేపథ్యంలో ఈఎస్ఐసీ వైద్య విద్యాపరంగా మౌలిక సదుపాయాలను నిరంతర ప్రాతిపదికన విస్తరిస్తూయువతకు అవకాశాలను అందుబాటులోకి తీసుకువస్తోందిప్రస్తుతం దేశంలో వివిధ ప్రాంతాల్లో 17 ఈఎస్ఐసీ వైద్య కళాశాలలు ఉన్నాయిఈఎస్ఐసీ అండర్ గ్రాడ్యుయేట్ (యూజీకోర్సుల (1,550 ఎమ్‌బీబీఎస్ సీట్లు)తో పాటుపోస్ట్‌గ్రాడ్యుయేట్ (పీజీకోర్సులను (559 ఎమ్‌డీఎమ్ఎస్ సీట్లు, 182 డీఎన్‌బీ సీట్లు, 17 డీఆర్ఎన్‌బీ సీట్లు, 31 డీఎమ్ఎమ్.సిహెచ్ సీట్లు, 10 పీహెచ్‌డీ సీట్లుఅందిస్తోందివీటికి అదనంగా, 3 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మరో 330 ఎమ్‌బీబీఎస్ సీట్లు ఉన్నాయివైద్య రంగంలో దేశానికి సేవ చేయాలని కోరుకుంటున్న విద్యార్థులకు ఈఎస్ఐసీకి చెందిన దంతవైద్య కళాశాలలు 124 సీట్లను, 2 నర్సింగ్ కళాశాలలు 120 బీఎస్సీ నర్సింగ్ సీట్లను పారామెడికల్ కాలేజీలు 292 సీట్లను అందిస్తున్నాయిమరిన్ని వైద్య కళాశాలలను నిర్మించే ప్రణాళికను ఈఎస్ఐసీ రూపొందించినాణ్యతతో కూడిన వైద్య విద్యను అందజేయడానికి సిద్దంగా ఉందిజీవితంలో వైద్యులుగా ఎదగాలని కలలుగంటున్న ఎంతో మంది యువజనులకు దీంతో అవకాశాలు లభించనున్నాయి.
ఈఎస్ఐసీ నిర్వహణలోని వైద్య సంస్థల్లో ఈఎస్ఐసీ పథకం కిందకు వచ్చే కార్మికుల పిల్లలకు ‘వార్డ్ ఆఫ్ ఇన్సూర్డ్ పర్సన్స్ (ఐపీకోటా’లో సీట్లను రిజర్వు చేశారుఈఎస్ఐసీ నిర్వహణలోని అన్ని వైద్య సంస్థల్లో ‘ఐపీ వార్డ్’ కోటాలో భాగంగా దాదాపు 880 సీట్లను రిజర్వు చేశారు. (వీటిలో ఎమ్‌బీబీఎస్ కోర్సుకు సుమారు 700 సీట్లు కాగామిగతా సీట్లను బీడీఎస్బీఎస్సీ నర్సింగ్పారామెడికల్సంబంధిత ఆరోగ్య విజ్ఞాన శాస్త్రాల కోర్సులకు చెందినవి).  కార్మికుల పట్ల ఈఎస్ఐసీ చాటుతున్న నిబద్ధతకు ఈ కార్యక్రమం ఒక నిదర్శనంకష్టపడి పనిచేసే వర్కర్లు భారత్ అభివృద్ధికి వెన్నెముకకార్మికుల పిల్లల ఆకాంక్షలను నెరవేర్చేందుకువృత్తిపరంగా స్థిరపడేందుకూదేశ భవితకు తోడ్పాటును అందించడానికి ఈఎస్ఐసీ తన వంతు పాత్రను పోషిస్తోంది.
ఇప్పటి వరకూ ఈఎస్ఐసీ ఆధ్వర్యంలోని వైద్య కళాశాలలు దేశానికి 4,961 మంది వైద్యులను అందించాయివీరిలో 1,682 మంది ఈఎస్ఐసీ కార్మికుల పిల్లలు కూడా ఉన్నారుపోస్ట్‌గ్రాడ్యుయేట్ స్థాయిలో, 1200 మందికి పైగా విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారుదీంతో దేశంలో స్పెషలైజ్‌డ్ డాక్టర్ల సంఖ్య మరింత పెరిగింది.
2047 
కల్లా అభివృద్ధి చెందిన దేశంగా మారాలన్న లక్ష్యం దిశగా భారత్ దూసుకుపోతున్న క్రమంలో కార్మికులకువారి కుటుంబాలకు సమగ్ర సామాజిక భద్రతను కల్పించాలన్న ఆశయానికి ఈఎస్ఐసీ కట్టుబడి ఉందిరాబోయే తరాల వారి కోసం ఆరోగ్యవంతమైనబలమైన భారత్‌ను అందించగల భావి వైద్య సిబ్బందిని తీర్చిదిద్దడానికి కూడా ఈఎస్ఐసీ కట్టుబడి ఉంది.

 

  1. అండర్ గ్రాడ్యుయేట్ (యూజీవిద్యార్థులు 

క్రమ సంఖ్య

వైద్య కళాశాల

యూజీ విద్యార్థులు 

ఐపీ వార్డు

1

జోకా

800

416

2

రాజాజీనగర్

975

367

3

కేకే నగర్

933

163

4

సనత్‌నగర్

616

235

5

ఫరీదాబాద్

725

210

6

గుల్బర్గా

912

291

 

మొత్తం

4961

1682

            2. పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీవిద్యార్థులు

క్రమ సంఖ్య

కళాశాల పేరు

పీజీ విద్యార్థులు

  1.  

అంధేరీ

79

  1.  

బసైదరాపూర్

185

  1.  

ఫరీదాబాద్

91

  1.  

గుల్బర్గా

12

  1.  

జోకా

143

  1.  

కేకే నగర్

155

  1.  

రాజాజీనగర్

513

  1.  

సనత్‌నగర్

89

 

మొత్తం

1267

***


(रिलीज़ आईडी: 2301759) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , हिन्दी , Gujarati , Tamil