రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేసేలా జపాన్ రక్షణ మంత్రితో న్యూఢిల్లీలో చర్చలు చేపట్టనున్న భారత రక్షణ మంత్రి

प्रविष्टि तिथि: 19 AUG 2026 1:17PM by PIB Hyderabad

జపాన్ రక్షణ మంత్రి శ్రీ షింజిరో కోయిజుమితో 2026 ఆగస్టు 20న న్యూఢిల్లీలో రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని, వ్యూహాత్మక విశ్వాసాన్ని, సహకారాన్ని మరింత పెంపొందిస్తుందని ఆశిస్తున్నారు. అలాగే ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వాన్ని, భద్రతను ప్రోత్సహించడంతో పాటు సహకారానికి కొత్త రంగాలను గుర్తిస్తుందని భావిస్తున్నారు.

రక్షణ పరికరాలు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీకి సంబంధించిన మూడు సూత్రాలను జపాన్ సవరించిన నేపథ్యంలో ‘మేక్–ఇన్–ఇండియా’ విధానం ప్రకారం సముద్ర రక్షణ భద్రత సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, రక్షణ పరికరాలు, సాంకేతిక సహకారంపై మంత్రులిద్దరూ తమ అభిప్రాయాలను పంచుకుంటారు. ద్వైపాక్షిక రక్షణ, భద్రత సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి ఈ సమావేశం ఒక అవకాశాన్ని అందిస్తుంది.

శ్రీ షింజిరో కోయిజుమి భారతదేశంలో తొలిసారి పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా 2026 ఆగస్టు 19న ముంబయిలోని పశ్చిమ నౌకాదళ కమాండ్‌ను సందర్శించారు. అక్కడ నౌకాదళ చీఫ్ స్టాఫ్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, పశ్చిమ నౌకాదళ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్‌తో చర్చలు నిర్వహించారు. భారత నావికాదళం పాత్ర, బాధ్యతల గురించి కార్యాచరణ సామర్థ్యాల గురించి ప్రతినిధి బృందానికి వివరించారు.

పశ్చిమ నౌకాదళ కమాండ్‌లో జపాన్ రక్షణ మంత్రి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అంతకుముందు నౌకాదళ డాక్‌యార్డులోని గౌరవ్ స్థంభ్‌ వద్ద పుష్ప‌గుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. దేశీయంగా నిర్మించిన నౌక ఐఎన్ఎస్ చెన్నైను కూడా సందర్శించారు.

 

స్వేచ్ఛాయుతమైన, అందరికీ అందుబాటులో ఉన్న, పటిష్టమైన, సుసంపన్నమైన ఇండో–పసిఫిక్ ప్రాంతాన్ని నిర్మించాలనే ఉమ్మడి దార్శనికతను భారత్, జపాన్‌ అనుసరిస్తున్నాయి. ద్వైపాక్షిక సహకారంలో పెరుగుతున్న వేగాన్ని జపాన్ రక్షణ మంత్రి రెండు రోజుల పర్యటన స్పష్టం చేస్తోంది. అలాగే భాగస్వామ్యాన్ని విస్తరించడంలో ఉభయపక్షాల నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం జపాన్ ప్రధానమంత్రి మిస్ సనాయి తకాయిచి ఢిల్లీకి వచ్చిన కొన్ని వారాల తర్వాత ఈ పర్యటన జరిగింది. ఆ సమావేశంలో రక్షణ, భద్రత సహకారాన్ని మరింత పెంపొందించేందుకు ఉభయపక్షాలు అంగీకరించాయి.

 

***


(रिलीज़ आईडी: 2301211) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Gujarati