సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్ మండపంలో నిర్వహించిన తిరంగా కాన్సర్ట్‌తో ముగిసిన హర్ ఘర్ తిరంగా – 2026 వందేమాతరం 150వ వార్షికోత్సవానికి అంకితం చేసిన వేడుకలు

प्रविष्टि तिथि: 18 AUG 2026 10:27PM by PIB Hyderabad

వందేమాతరం 150 ఏళ్ల ఉత్సవాలకు అంకితం చేస్తూ ప్రముఖ గాయకుడు బీ ప్రాక్ ఆధ్వర్యంలో ప్రత్యేక హర్ ఘర్ తిరంగా సంగీత కచేరీని న్యూఢిల్లీలోని భారత్ మండపంలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ విజయవంతంగా నిర్వహించింది. ఈ ప్రదర్శనతో దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా–2026 ఉద్యమానికి ముగింపు పలికింది.

ఈ ఉత్సాహభరితమైన వేడుకలో జాతీయ పతాకాన్ని, భారతదేశపు శాశ్వత స్ఫూర్తిని కీర్తిస్తూ... సంగీతంతో దేశభక్తిని ప్రతిధ్వనిస్తూ గాయకుడు బీ ప్రాక్ పౌరులందరినీ ఏకం చేశారు. ఈ ఏడాది నిర్వహించిన హర్ ఘర్ తిరంగా–2026లో భాగంగా ఈ కాన్సర్ట్‌ను ఏర్పాటు చేశారు. వందేమాతరం 150వ వార్షికోత్సవాలకు అంకితం చేస్తూ ఈ ఏడాది నిర్వహించిన వేడుకలకు ఈ కచేరీ సరికొత్త సంగీత కోణాన్ని జోడించింది. మాతృభూమిపై  ప్రేమ, త్యాగం, జాతీయ గర్వం లాంటి భావోద్వేగాలతో సంగీతం ద్వారా తరతరాలను ఆ సాయంత్రం అనుసంధానించింది.

 

 ‘

 

తన విలక్షణమైన గాత్రానికి, శక్తిమంతమైన సంగీత ప్రదర్శనలకు బీ ప్రాక్ పేరు గాంచారు. ఆయన ఎంతోగానో ఇష్టపడే దేశభక్తి గీతం ‘‘తేరి మిట్టీ’’తో సహా ప్రజాదరణ పొందిన పాటలను ఆలపించారు. దేశవ్యాప్తంగా శ్రోతలను ఎంతగానో ఆకట్టుకున్న ఈ పాట... భారత భద్రతా బలగాల ధైర్యం, త్యాగాల జ్ఞాపకాలను గుర్తు చేసింది. యువ గాయని మాన్య త్రిపాఠి గానంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. త్రివర్ణ పతాకాన్ని, దేశభక్తి స్ఫూర్తిని ఉత్సాహవంతమైన వేడుకగా నిర్వహించుకోవడానికి నాంది పలికింది.

ఈ మ్యూజిక్ కాన్సర్ట్‌లో ఢిల్లీ నలుమూలల నుంచి 1,000 మందికి పైగా పాఠశాల విద్యార్థులు, ముందుగానే ఆన్‌లైన్లో నమోదు చేసుకున్న 7,000 మందికి పైగా ప్రేక్షకులు పాల్గొన్నారు. జాతీయ పతాకం, జాతీయ గేయం, దేశభక్తి, ఐక్యతా స్ఫూర్తిని వేడుకగా నిర్వహించుకొనేందుకు వివిధ వర్గాలకు చెందిన ప్రజలు ఒక్కచోట చేరారు.


ఆగస్టు 9 నుంచి 17 వరకు నిర్వహించిన హర్ ఘర్ తిరంగా–2026 ప్రచారానికి ఈ మ్యూజిక్ కాన్సర్ట్ ముగింపు పలికింది. హర్ ఘర్ తిరంగా ప్రచారం కేంద్రంగా వివిధ రకాల కార్యక్రమాల్లో దేశవ్యాప్తంగా పౌరులు పాల్గొన్నారు. గడచిన అయిదేళ్లలో హర్ ఘర్ తిరంగా దేశవ్యాప్త ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంది. దీనిలో కేవలం జెండాలు ఎగురవేయడానికి మాత్రమే పరిమితం కాకుండా... తిరంగా యాత్రలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు, సామాజిక కార్యక్రమాలు, డిజిటల్ కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములయ్యారు.

ఈ ఏడాది ప్రజా భాగస్వామ్య స్థాయికి ముఖ్యమైన సూచికగా సెల్ఫీ విత్ తిరంగా ప్రచారానికి లభించిన స్పందన కీలకమైన సూచికగా నిలిచింది. హర్ ఘర్ తిరంగా పోర్టల్‌లో 8.27 కోట్లకు పైగా సెల్ఫీలు అప్‌లోడ్ అయ్యాయి. ఇది గతేడాది 7.5 కోట్ల సెల్ఫీల రికార్డును అధిగమించింది. ఈ రికార్డు స్థాయి భాగస్వామ్యమే ఈ ప్రచారాన్ని ప్రజలు స్వీకరించడాన్ని సూచిస్తోంది. అలాగే భౌతిక, డిజిటల్ భాగస్వామ్యం ద్వారా జాతీయ పతాకం, జాతీయ గేయంతో తమ అనుబంధాన్ని వ్యక్తం చేయడానికి పౌరులు చూపుతున్న సుముఖతను తెలియజేస్తోంది.

తిరంగా కాన్సర్ట్‌ను ఉధ్దేశించి కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ ప్రసంగించారు. దేశ ఉమ్మడి ఆకాంక్షలకు, త్యాగాలకు, విజయాలకు త్రివర్ణ పతాకం ప్రతీక అన్నారు. తరతరాలుగా భారతీయులను ఈ పతాకం ఏకం చేస్తోందన్నారు. వందేమాతరం 150 వసంతాలను పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఈ ఏడాది వేడుకలకున్న ప్రాధాన్యాన్ని వివరించారు. జాతీయ గేయం వందేమాతరాన్ని మాతృభూమిపై ఉన్న ప్రేమకు శాశ్వత నిదర్శనంగా, తరతరాల భారతీయులకు స్ఫూర్తిగా ఆయన వర్ణించారు. ఈ కార్యక్రమానికి సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ అగర్వాల్, ఇతర ప్రముఖులు కూడా హాజరయ్యారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, స్థానిక సంస్థలు, విద్యా సంస్థలు, సాయుధ దళాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రజా సంఘాలు, ప్రజాభాగస్వామ్యంతో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో హర్ ఘర్ తిరంగా–2026ను ఘనంగా నిర్వహించారు. తిరంగా యాత్రలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ఎగ్జిబిషన్లు, సామూహిక కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాల ద్వారా ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా ఉన్న నగరాలు, పట్టణాలు, గ్రామాలకు చేరుకుంది.

image.png

భారత్ మండపంలో జరిగిన హర్ ఘర్ తిరంగా సంగీత కచేరీ ఈ ఉద్యమానికి ఒక సముచితమైన ముగింపును అందించింది. బీ ప్రాక్ ప్రదర్శన వేలాది మంది యువ విద్యార్థులను, పౌరులను సంగీతభరితమైన ఉత్సాహభరిత సాయంత్రంలో ఒకచోట చేర్చింది. హర్ ఘర్ తిరంగా ఎంతటి భారీ ప్రజా ఉద్యమంగా మారిందో ఈ కాన్సర్ట్, రికార్డు స్థాయిలో వచ్చిన తిరంగా సెల్ఫీలు స్పష్టంగా వివరిస్తున్నాయి. పౌరులే స్వయంగా ముందుండి నడిపిస్తూ, దేశవ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యంతో కొనసాగుతున్న అతిపెద్ద ఉద్యమాలలో ఇది ఒకటిగా నిలిచింది. 

 

***


(रिलीज़ आईडी: 2301190) आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Punjabi