ఉప రాష్ట్రపతి సచివాలయం
ఉత్తరాఖండ్‌లో ఆగస్టు 19, 20 తేదిల్లో పర్యటించనున్న ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్
ఐజీఎన్ఎఫ్ఏలో భారత అటవీ సేవా ప్రొబేషనర్లతో సంభాషించనున్న ఉపరాష్ట్రపతి
ఎల్‌బీఎస్ఎన్ఏఏలో ఐఏఎస్ శిక్షణా కోర్సు ముగింపు వేడుకకు హాజరు
నాడు పోస్టు చేయడమైనది:
18 AUG 2026 1:23PM by PIB Hyderabad
భారత ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ 2026 ఆగస్టు 19, 20 తేదీల్లో రెండు రోజుల పాటు ఉత్తరాఖండ్‌లో పర్యటించనున్నారు.
ఆగస్టు 19న డెహ్రాడూన్‌లోని ఇందిరాగాంధీ జాతీయ అటవీ అకాడమీ (ఐజీఎన్‌ఎఫ్‌ఏ)ను ఉపరాష్ట్రపతి సందర్శించనున్నారు. అక్కడ 2025–27 బ్యాచ్‌కు చెందిన భారత అటవీ సేవా (ఐఎఫ్‌ఎస్) ప్రొబేషనర్లను ఉద్దేశించి ప్రసంగించడంతో పాటు వారితో ముఖాముఖి సంభాషించనున్నారు.
ఆగస్టు 20న ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ పరిపాలనా అకాడమీలో (ఎల్‌బీఎస్‌ఎన్‌ఏఏ) జరిగే 2024 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ప్రొఫెషనల్ కోర్సు ఫేజ్-2 ముగింపు కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
అకాడమీ సందర్శన సందర్భంగా సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు ఉపరాష్ట్రపతి పుష్పాంజలి ఘటిస్తారు.
***
(రిలీజ్ ఐడి: 2300908)
సందర్శకుల సూచీ సంఖ్య : : 49