రక్షణ మంత్రిత్వ శాఖ
జనరల్ అటామిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్స్ సంస్థతో రక్షణ మంత్రిత్వశాఖ ఒప్పందం
భారత నౌకాదళం కోసం రెండు ఎంక్యూ-9బీ సీ గార్డియన్ విమాన వ్యవస్థలు 30 నెలల పాటు లీజు
प्रविष्टि तिथि:
17 AUG 2026 2:20PM by PIB Hyderabad
భారత నౌకాదళ నిఘా వ్యవస్థను మరింత బలపేతం చేసే దిశగా రక్షణ మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నౌకాదళ రక్షణ కోసం రెండు ‘ఎంక్యూ-9బీ సీ గార్డియన్ హై ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ (హెచ్ఏఎల్ఈ) రిమోట్‌లీ పైలటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్ (ఆర్‌పీఏఎస్)’ను 30 నెలల పాటు లీజుకు తీసుకునేందుకు జనరల్ అటామిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్స్ సంస్థతో (జీఏ-ఏఎస్ఐ)తో మంత్రిత్వశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ సుమారు రూ.1,943 కోట్లు. 2026 ఆగస్టు 17న న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్-2లో రక్షణ శాఖ అదనపు కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ (కొనుగోళ్లు విభాగం) శ్రీ ఎ. అన్బరసు సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి.

అధునాతన సాంకేతిక వ్యవస్థలు, అత్యాధునిక సెన్సర్లు, అధునాతన పెలోడ్‌లతో కూడిన ఎంక్యూ-9బీ సీ గార్డియన్ హెచ్ఏఎల్ఈ ఆర్‌పీఏఎస్.. భారత నౌకాదళానికి చెందిన సముద్ర పరిధిపై అవగాహన సామర్థ్యాలను గణనీయంగా పెంచనున్నాయి. ఈ వ్యవస్థలు విస్తారమైన సముద్ర ప్రాంతాల్లో నిరంతర నిఘా, గూఢచార సమాచారం సేకరణ, పర్యవేక్షణ, గూఢచర్య సామర్థ్యాలను అందిస్తాయి. దీని ద్వారా హిందూ మహాసముద్ర ప్రాంతంలో చోటుచేసుకునే పరిణామాలను పర్యవేక్షించి, తక్షణమే స్పందించడానికి భారత నౌకాదళ దళాలకు ఇవి ఎంతగానో దోహదపడతాయి.

***
(रिलीज़ आईडी: 2300449)
आगंतुक पटल : 5