ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉపరాష్ట్రపతి శ్రీ సీ పీ రాధాకృష్ణన్ రాసిన వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి


స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల గురించి, 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని వ్యాసంలో ప్రముఖంగా ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి

నాడు పోస్టు చేయడమైనది: 15 AUG 2026 5:34PM by PIB Hyderabad

ఉపరాష్ట్రపతి శ్రీ సీ పీ రాధాకృష్ణన్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పంచుకున్నారు.

భారతదేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ, గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ సి. పి. రాధాకృష్ణన్‌ అండమాన్‌ నికోబార్‌ దీవులను సందర్శించిన విషయాన్ని తన వ్యాసంలో గుర్తుచేసుకున్నారని,  దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర సమరయోధులు చేసిన త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అమృత కాలంలో 2047 నాటికి వికసిత్‌ భారత్‌ నిర్మాణానికి ప్రజలు తమను తాము అంకితం చేసుకోవాలని, దేశ ప్రగతి, సుసంపన్నత కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఈ వ్యాసం పిలుపునిస్తోందని ఆయన తెలిపారు.

“భారత్‌ 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ సి. పి. రాధాకృష్ణన్‌ అండమాన్‌ నికోబార్‌ దీవులను సందర్శించిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర సమరయోధులు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. ఈ అమృత కాలంలో 2047 నాటికి వికసిత్‌ భారత్‌ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ తమను తాము అంకితం చేసుకోవాలని, దేశ ప్రగతి, సుసంపన్నత కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 

 

***


(రిలీజ్ ఐడి: 2300024) సందర్శకుల సూచీ సంఖ్య : : 68