ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 15 AUG 2026 10:12AM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ దార్శనికత, కృషి నుంచి దేశం ఎల్లప్పుడూ స్ఫూర్తి పొందుతూనే ఉంటుందన్నారు.

ప్రతి భారతీయుడి పురోగతి కోసం కృషి చేస్తూ... దేశాన్ని ప్రగతిశీలంగా, సుసంపన్నంగా తీర్చిదిద్దడం పట్ల తమ నిబద్ధతను ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.

‘ఎక్స్’ వేదికగా చేసిన పోస్టులో, ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

“ఈ ఉదయం రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పించాం. ఆయన దార్శనికత, కృషి నుంచి మేం ఎల్లప్పుడూ స్ఫూర్తి పొందుతూనే ఉంటాం. ప్రతి భారతీయుడి పురోగతి కోసం, మన దేశాన్ని ప్రగతిశీలంగా, సుసంపన్నంగా తీర్చిదిద్దడం కోసం మేం కృషి చేస్తూనే ఉంటాం.”


(रिलीज़ आईडी: 2299819) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , English , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam