ప్రధాన మంత్రి కార్యాలయం
దేశ బలాన్ని ప్రతిబింబిస్తూ వికసిత్ భారత్ లక్ష్యం దిశగా మరింత సంకల్పంతో ముందుకు సాగేందుకు స్ఫూర్తినిచ్చిన రాష్ట్రపతి స్వాతంత్ర దినోత్సవ ప్రసంగం: ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
14 AUG 2026 8:44PM by PIB Hyderabad
80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగాన్ని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. రాష్ట్రపతి ప్రసంగం స్ఫూర్తిదాయకంగా, ఆలోచనాత్మకంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రపతి ఆలోచనలు మన దేశ బలాన్ని, ప్రతి భారతీయుడి ఆకాంక్షలను ప్రతిబింబిస్తున్నాయని ప్రధానమంత్రి అన్నారు. వికసిత్ భారత్ నిర్మాణం కోసం మరింత పట్టుదలతో, రెట్టించిన సంకల్పంతో పనిచేయడానికి రాష్ట్రపతి సందేశం మనందరికీ స్ఫూర్తినిస్తోందని ఆయన తెలిపారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి చేసిన ప్రసంగం స్ఫూర్తిదాయకంగా, ఆలోచనాత్మకంగా ఉంది. ఆమె ఆలోచనలు మన దేశ బలాన్ని, ప్రతి భారతీయుడి ఆకాంక్షలను ప్రతిబింబిస్తున్నాయి. వికసిత్ భారత్ లక్ష్యం కోసం మరింత పట్టుదలతో, సంకల్పంతో పనిచేయడానికి ఆమె సందేశం మనందరికీ స్ఫూర్తినిస్తోంది” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్ ‘లో పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 2299743)
సందర్శకుల సూచీ సంఖ్య : : 45
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Kannada