అంతరిక్ష విభాగం
azadi ka amrit mahotsav

పార్లమెంటు ప్రశ్న: అంతరిక్ష రంగంలో ప్రైవేటు కంపెనీలు

నాడు పోస్టు చేయడమైనది: 13 AUG 2026 2:04PM by PIB Hyderabad

డీపీఐఐటీ స్టార్టప్ ఇండియా పోర్టల్ ప్రకారం భారతదేశంలో సుమారు 440 అంతరిక్ష సాంకేతిక అంకురసంస్థలు నమోదయ్యాయి. వివిధ అంతరిక్ష కార్యకలాపాలను చేపట్టేందుకు 52 ప్రభుత్వేతర సంస్థలకు (ఎన్‌జీఈలు) ఇన్-స్పేస్ సంస్థ 113 అనుమతులను మంజూరు చేసింది. ఇందులో 18 అంకుర సంస్థలున్నాయి. వాటి వివరాలు:

  1. అగ్నికుల్ కాస్మోస్ ప్రైవేట్ లిమిటెడ్

  2. అక్షత్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్

  3. అజిస్టా బీఎస్‌టీ

  4. బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్

  5. కాస్మోసర్వ్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్

  6. ధ్రువ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్

  7. దిగంతర రీసెర్చ్ అండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్

  8. గెలాక్స్ఐ స్పేస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్

  9. హెచ్ఈఎక్స్20ల్యాబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్

  10. ఇనార్బిట్ స్పేస్ టెలికమ్యూనికేన్స్ ప్రైవేట్ లిమిటెడ్

  11. మనస్తు స్పేస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్

  12. ఎన్‌స్పేస్ టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్

  13. ఆర్బిట్ఎయిడ్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్

  14. పియర్‌సైట్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్

  15. పిక్సెల్‌స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్

  16. స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్

  17. స్పేస్ కిడ్జ్ ఇండియా

  18. టేక్‌మి2స్పేస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్

ఇస్రో మౌలిక సదుపాయాల (శ్రీహరికోటలోని ఇస్రో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని లాంఛ్ ప్యాడ్లతో సహా) వినియోగం, అందుబాటులోకి తీసుకురావటానికి సమర్పించే దరఖాస్తులను… ఇన్-స్పేస్ డిజిటల్ వేదిక ద్వారా స్వీకరించిన దరఖాస్తు ఆధారంగా ఎస్ఓపీ విధానంలో పరిశీలిస్తారు. సన్నద్ధతకు సంబంధించిన అంశాలను ఇన్-స్పేస్ నిపుణుల కమిటీ సమీక్షిస్తుంది.

రాబోయే రెండేళ్లలో భారత ప్రైవేటు కంపెనీలు ప్రయోగించనున్న మొత్తం వాణిజ్య రాకెట్ల సంఖ్య ఇలా ఉంది.

ఎఫ్‌వై 26-27: 02

ఎఫ్‌వై 27-28: ప్రయోగాల జాబితాకు ఇన్-స్పేస్ నుంచి ఆమోదం లభించలేదు. భారత ప్రైవేట్ సంస్థల ద్వారా ఆరుకుపైగా ప్రయోగాలు జరగవచ్చని అంచనా.

ఈ సమాచారాన్ని ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల కేంద్ర సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఇవాళ రాజ్యసభలో లిఖితపూర్వకంగా అందించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2299013) సందర్శకుల సూచీ సంఖ్య : : 64
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Tamil