పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
‘2026 హర్ ఘర్ తిరంగా ప్రచారోద్యమం’లో భాగంగా తిరంగా ర్యాలీ
ప్రారంభించిన పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు
प्रविष्टि तिथि:
13 AUG 2026 2:18PM by PIB Hyderabad
స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకొని ‘2026 హర్ ఘర్ తిరంగా ప్రచారోద్యమం’లో భాగంగా ‘‘తిరంగా ర్యాలీ’’ని పౌర విమానయాన శాఖ ఈ రోజు ఏర్పాటు చేసింది. ఈ ర్యాలీని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి శ్రీ మురళీధర్ మొహోల్ సమక్షంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ కార్యదర్శి శ్రీ సమీర్ కుమార్ సిన్హాతో పాటు మంత్రిత్వశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఒక డిజిటల్ వీడియో వాల్‌ను శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, శ్రీ మురళీధర్ మొహోల్ ప్రారంభించడంతో వేడుకలు మొదలయ్యాయి. ఆ తరువాత వందే మాతర గేయాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, తదితరులు పాలుపంచుకున్నారు.
తదనంతరం, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు తిరంగా ర్యాలీని ప్రారంభించారు. మంత్రిత్వశాఖ అధికారులు, సిబ్బంది, మంత్రిత్వశాఖకు అనుబంధంగా ఉన్న అన్ని కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థల అధికారులు, సిబ్బంది జాతీయ జెండాలతో ఊరేగింపులో పాల్గొన్నారు.
శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, శ్రీ మురళీధర్ మొహోల్, శ్రీ సమీర్ కుమార్ సిన్హా సారథ్యంలో ఊరేగింపు ఉడాన్ భవన్ నుంచి మొదలై, రాజీవ్ గాంధీ భవన్లో నెలకొన్న ఏవియేషన్ పార్కు వరకు ర్యాలీ సాగింది. అధికారులు, సిబ్బంది చేతులలో త్రివర్ణ పతాకాలను పట్టుకొని ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం స్వాతంత్య్ర దినోత్సవంతో ముడిపడిన దేశాభిమాన భావనకు అద్దం పట్టింది.
ఏవియేషన్ పార్కులో జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది.
‘2026 హర్ ఘర్ తిరంగా ప్రచారోద్యమం’లో భాగంగా ఈ తిరంగా ర్యాలీని నిర్వహించారు. మనసును ఉప్పొంగిపోయేటట్లు చేసే జాతీయ పతాకాన్ని చేత ధరించి జాతీయ సమైక్యత, సంతోషాల విలువలు ఉట్టిపడేలా స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించుకొనేందుకు పౌరులకు ఈ ప్రచార ఉద్యమం స్ఫూర్తిని అందిస్తుంది.
ఈ కార్యక్రమంలో ఏఏఐ చైర్మన్ శ్రీ విపిన్ కుమార్, డీజీసీఏ డైరెక్టర్ జనరల్ శ్రీ వీర్ విక్రమ్ యాదవ్, ఏఏఐబీ డైరెక్టర్ జనరల్ శ్రీ జి.వి.జి. యుగంధర్, బీసీఏఎస్ డైరెక్టర్ జనరల్ శ్రీ రాజేశ్ నిర్వాణ్, ఏఈఆర్ఏ చైర్‌పర్సన్ శ్రీ ఎస్.కె.జి. రహాటే కూడా పాల్గొన్నారు.
***
(रिलीज़ आईडी: 2298866)
आगंतुक पटल : 10