సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

చోరీకి గురైన పురాతన వస్తువుల సేకరణ

నాడు పోస్టు చేయడమైనది: 13 AUG 2026 2:23PM by PIB Hyderabad

పలు దేశాల నుంచి స్వాధీనం చేసుకున్న పురాతన వస్తువుల జాబితా అనుబంధం-Iలో ఇచ్చారు.

వలస పాలన కాలంలో విదేశాలకు తరలించిన పురాతన వస్తువులను వెనక్కి తీసుకువచ్చే అంశాన్ని ప్రభుత్వం పలు వేదికలపై ప్రస్తావిస్తోంది. జాతీయ, అంతర్జాతీయ చట్టాలు, ఒప్పందాలను పరిగణలోకి తీసుకుని, ఒక్కో సందర్భానికి అనుగుణంగా ఈ సేకరణ ప్రక్రియను చేపడతారు. సంబంధిత దేశాలు, ప్రభుత్వాల మధ్య పరస్పర అవగాహన, సహకారం ద్వారా వస్తువులను తిరిగి తీసుకురావటం సాధ్యమవుతుంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో మ్యూజియాలు, ఆర్ట్ గ్యాలరీల్లో భారతదేశానికి చెందిన పురాతన వస్తువులున్నాయి. ప్రైవేటు వ్యక్తుల వద్ద కూడా కొన్ని వస్తువులున్నాయి. అయితే ఆ వస్తువుల సేకరణకు సంబంధించిన సమగ్ర జాబితా అందుబాటులో లేదు. భారతదేశానికి చెందిన పురాతన వస్తువులను అక్రమంగా విదేశాలకు పంపినట్లు నివేదికలు వచ్చిన ప్రతీసారీ వాటిని వెనక్కి తీసుకురావటానికి భారత రాయబార కార్యాలయం, మిషన్ ద్వారా చర్యలు తీసుకుంటున్నారు.

అనుబంధం-I

యూఎస్ఏ, ఆస్ట్రేలియా, యూకే, నెదర్లాండ్స్ నుంచి సేకరించిన పురాతన వస్తువుల వివరాలు


 

క్రమ సంఖ్య

దేశం

సేకరించిన వస్తువుల సంఖ్య (జూన్ 2026 వరకు)

  1.  

ఆస్ట్రేలియా

51

  1.  

నెదర్లాండ్స్

01

  1.  

యూకే

21

  1.  

యూఎస్ఏ

589

 

 

662

ఈ సమాచారాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్... లిఖితపూర్వకంగా ఇవాళ రాజ్యసభకు అందించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2298860) సందర్శకుల సూచీ సంఖ్య : : 66
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR