నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పెట్రోలియం, శుద్ధి రంగాల్లో హరిత హైడ్రోజన్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్

నాడు పోస్టు చేయడమైనది: 11 AUG 2026 3:10PM by PIB Hyderabad

హరిత హైడ్రోజన్‌నూ, దాని ఉత్పన్నాలనూ ఉత్పత్తి చేయడానికీ, వినియోగానికీ, ఎగుమతికీ అంతర్జాతీయ కేంద్రంగా భారతదేశాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్‌ (ఎన్‌జీహెచ్ఎం)ను భారత ప్రభుత్వం అమలు చేస్తోంది.

దిగువ పేర్కొన్న ప్రకారం శుద్ధి కర్మాగారాలకు ఏడాదికి 30 కిలో టన్నుల (కేటీపీఏ) గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఎన్‌జీహెచ్ఎం అమలు చేస్తున్న ఎస్ఐజీహెచ్‌టీ (స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్స్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్) మోడ్–2బీ పథకం పరిధిలో కేటాయించారు.

 

శుద్ధి కర్మాగారం

ప్రాంతం

హరిత హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యం

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్

పానిపట్

10 కేటీపీఏ

భారత్ పెట్రోలియం కార్పొరేషన్

బీనా

5 కేటీపీఏ

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్

వైజాగ్

5 కేటీపీఏ

నుమాలీఘర్ రిఫైనరీస్

నుమాలీఘర్

10 కేటీపీఏ

మొత్తం

 

30 కేటీపీఏ

ప్రైవేటు డెవలపర్ల ద్వారా బీవోవో (బిల్డ్ ఓన్ ఆపరేట్) పద్ధతిలో ఈ ప్రాజెక్టులను అమలు చేస్తారు. దీనిలో సంబంధిత  ప్రాజెక్టు డెవలపర్లు ప్రాజెక్టుల వారీగా పెట్టుబడులు పెడతారు. దేశీయంగా గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసి, వినియోగించడం ద్వారా శిలాజ ఇంధనాల దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందనీ, ఇంధన భద్రత మెరుగవుతుందనీ, భారతదేశ శుద్ధ ఇంధన పరివర్తన, సున్నా ఉద్గారాల లక్ష్యాలకు తోడ్పాటు లభిస్తుందనీ భావిస్తున్నారు.

ఈ సమాచారాన్ని కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీపాద యశో నాయక్ రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా అందించారు. 

 

***


(రిలీజ్ ఐడి: 2297755) సందర్శకుల సూచీ సంఖ్య : : 64
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Gujarati , Tamil , Kannada