పార్లమెంటరీ వ్యవహారాలు
azadi ka amrit mahotsav

నేషనల్ యూత్ పార్లమెంట్ స్కీమ్ నవీకరించిన వెబ్ పోర్టల్ ఎన్‌వైపీఎస్ 2.0ను ప్రారంభించిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ

నాడు పోస్టు చేయడమైనది: 10 AUG 2026 1:15PM by PIB Hyderabad

నేషనల్ యూత్ పార్లమెంట్ స్కీమ్ (ఎన్‌వైపీఎస్) వెబ్ పోర్టల్ నవీకరించిన వెర్షన్ ఎన్‌వైపీఎస్ 2.0ను సెప్టెంబర్ 11, 2024న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రారంభించింది. గుర్తింపు పొందిన విద్యాసంస్థల విద్యార్థులకు మాత్రమే పరిమితమైన పాత వెర్షన్‌లా కాకుండా… దేశంలోని అన్ని విద్యాసంస్థలు, గ్రూపులు, పౌరులందరికీ ఎన్‌వైపీఎస్ 2.0 అందుబాటులో ఉంటుంది. దీన్ని ప్రారంభించిన నాటి నుంచి పోర్టల్‌లో నమోదైన సంస్థాగత, సమూహ, వ్యక్తిగత రిజిస్ట్రేషన్ల వివరాలు, ప్రతి విభాగం ద్వారా నిర్వహించిన సమావేశాల వివరాలు ఇలా ఉన్నాయి.

 

ఎన్‌వైపీఎస్ వెబ్ పోర్టల్ గురించి విస్తృత ప్రచారం కల్పించేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు, రాష్ట్ర, యూటీల శాసనసభలు, విద్యా సంస్థల (సీబీఎస్ఈ, సీఐఎస్ సీఈ)కు మంత్రిత్వశాఖ లేఖలు రాసింది. సంసద్ టీవీలో ఎప్పటికప్పుడు ప్రచార వీడియోను ప్రసారం చేస్తున్నది. భాగస్వాముల అవసరాలకు అనుగుణంగా సీసీఎంఎస్ పోర్టల్‌ను అవసరానుగుణంగా తరచూ నవీకరిస్తున్నారు.

***


(రిలీజ్ ఐడి: 2297116) సందర్శకుల సూచీ సంఖ్య : : 51
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati , Tamil , Kannada