ప్రధాన మంత్రి కార్యాలయం
2026 కామన్వెల్త్ గేమ్స్ పతక విజేతలతో సమావేశమైన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
09 AUG 2026 10:07PM by PIB Hyderabad
2026 కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన భారత విజేతలతో 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. అథ్లెట్లతో మాట్లాడి, వారి అనుభవాల గురించి తెలుసుకున్నారు.
అథ్లెట్లు సాధించిన విజయాలు యావత్ దేశానికి గర్వకారణమని, యువత క్రీడల వైపు ఆకర్షితులయ్యేందుకు ఈ విజయాలు స్ఫూర్తినిస్తాయని ప్రధానమంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు.
“2026 కామన్వెల్త్ గేమ్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరచి పతకాలు సాధించిన విజేతలతో 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో సమావేశమవటం ఆనందంగా ఉంది. వారి అనుభవాలను స్వయంగా తెలుసుకున్నాను.
ప్రతి ఒక్కరూ అద్భుతమైన ప్రదర్శనతో దేశం గర్వించేలా చేశారు. వారి విజయం ఎంతో మంది యువతకు స్ఫూర్తి"
***
(రిలీజ్ ఐడి: 2296965)
సందర్శకుల సూచీ సంఖ్య : : 50
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Malayalam
,
Bengali
,
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Kannada