అంతరిక్ష విభాగం
azadi ka amrit mahotsav

గగన్ యాన్ … సాధించిన లక్ష్యాలను రాజ్యసభకు వివరించిన డాక్టర్ జితేంద్ర సింగ్


త్వరలో నెరవేరనున్న భారత తొలి మానవ సహిత అంతరిక్షయాత్ర లక్ష్యం

ఇప్పటికే కొన్ని ప్రమాణాలను అందుకున్నట్లు వెల్లడించిన డాక్టర్ జితేంద్ర సింగ్

ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో వ్యోమమిత్రను తీసుకెళ్లే తొలి మానవరహిత గగన్‌యాన్ మిషన్‌ ప్రయోగం

2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రం ఏర్పాటు దిశగా పురోగతి

प्रविष्टि तिथि: 06 AUG 2026 5:00PM by PIB Hyderabad

భారత్ తొలి మానవ అంతరిక్ష యాత్ర గగన్‌యాన్- లక్ష్యానికి సంబంధించి... మానవ ప్రయాణానికి అవసరమైన కీలక భద్రతా ప్రమాణాల అభివృద్ధిధ్రువీకరణలో ప్రధానమైన అంచెలను విజయవంతంగా చేరుకున్నట్లు కేంద్ర శాస్త్రసాంకేతిక శాఖభూ విజ్ఞాన శాఖ స్వతంత్ర హోదాప్రధానమంత్రి కార్యాలయంసిబ్బందిప్రజా ఫిర్యాదులుపెన్షన్లుఅణుశక్తిఅంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు రాజ్యసభకు తెలిపారుఈ పురోగతితో దేశం చేపట్టనున్న తొలి స్వదేశీ మానవ సహిత అంతరిక్ష యాత్రగగన్‌యాన్ సాకారం దిశగా ప్రధానమైన ముందడుగు పడినట్లు ఆయన పేర్కొన్నారు.

అంతరిక్షంలోకి మానవ ప్రయాణానికి అనువుగా రూపొందించిన హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ (హెచ్ఎల్‌వీఎం–3) కు సంబంధించిన అన్ని చోదక (ప్రొపల్షన్దశలునిర్మాణ వ్యవస్థల అభివృద్ధిభూమిపై నిర్వహించే పరీక్షలు పూర్తయ్యాయని మంత్రి తెలిపారుక్రూ మాడ్యూల్సర్వీస్ మాడ్యూళ్లకు సంబంధించిన ప్రొపల్షన్ వ్యవస్థలను అభివృద్ధి చేసివిజయవంతంగా పరీక్షించి అర్హత నిర్ధారణలను కూడా పూర్తిచేసినట్లు తెలిపారుపర్యావరణ నియంత్రణజీవన సహాయక వ్యవస్థ (ఎన్విరాన్‌మెంటల్ కంట్రోల్ అండ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ఈసీఎల్ఎస్ఎస్ఇంజినీరింగ్ నమూనాథర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్డీసెలరేషన్ సిస్టమ్క్రూ మాడ్యూల్ అప్‌రైటింగ్ సిస్టమ్ఎండ్-టు-ఎండ్ ఏవియానిక్స్ వ్యవస్థలను కూడా విజయవంతంగా అభివృద్ధి చేసి పరీక్షించినట్లు శ్రీ జితేంద్ర సింగ్ వెల్లడించారు.

వ్యోమగాముల భద్రతకు సంబంధించి కూడా గణనీయమైన పురోగతిని సాధించినట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారుక్రూ ఎస్కేప్ సిస్టమ్ (సీఈఎస్కోసం అవసరమైన అయిదు రకాల మోటార్లను అభివృద్ధి చేసి విజయవంతంగా స్టాటిక్ పరీక్షలు నిర్వహించామనివాటికి సంబంధించిన అన్ని నిర్మాణ వ్యవస్థల అర్హత నిర్ధారణ కూడా పూర్తిచేశామని చెప్పారురానున్న గగన్‌యాన్ మిషన్లకు అవసరమైన కీలక మౌలిక సదుపాయాలను కూడా సిద్ధం చేసినట్లు వెల్లడించారువీటిలో ఆర్బిటల్ మాడ్యూల్ ప్రిపరేషన్ ఫెసిలిటీగగన్‌యాన్ కంట్రోల్ సెంటర్వ్యోమగాముల శిక్షణ కేంద్రంతో పాటు రెండో ప్రయోగ వేదికలో అవసరమైన మార్పులు పూర్తయ్యాయని తెలిపారు.

క్రూ ఎస్కేప్ సిస్టమ్ పనితీరును అంతరిక్ష ప్రయాణ పరిస్థితుల్లో పరీక్షించేందుకు చేపట్టిన టెస్ట్ వెహికల్–డి1 (టీవీ–డి1) మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారుక్రూ మాడ్యూల్ నమూనా (సిమ్యులేటెడ్ క్రూ మాడ్యూల్ను ఉపయోగించి నిర్వహించిన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్–01, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్–02 ద్వారా డీసెలరేషన్ సిస్టమ్ పనితీరును విజయవంతంగా ధ్రువీకరించినట్లు చెప్పారుప్రస్తుతం తదుపరి టెస్ట్ వెహికల్ మిషన్–డి2 (టీవీ–డి2)కు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు

భూమిపై కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను ఖరారు చేశామనిఐడీఆర్ఎస్ఎస్ - 1 కు సంబంధించిన ఫీడర్ స్టేషన్లుభూతల కమ్యూనికేషన్ సంబంధాలను ఏర్పాటు చేశామని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారువ్యోమగాములను సురక్షితంగా తిరిగి రప్పించేందుకు అవసరమైన వనరులను గుర్తించిక్రూ రికవరీ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు వెల్లడించారుఇదే సమయంలో కొత్తగా అభివృద్ధి చేసిన వివిధ వ్యవస్థలకు సంబంధించి భూమిపై అర్హత నిర్ధారణ పరీక్షలు కూడా సమాంతరంగా కొనసాగుతున్నాయని తెలిపారు.

మిషన్ కార్యాచరణ ప్రణాళికను వివరిస్తూఈ కార్యక్రమం కింద తొలిసారిగా అభివృద్ధి చేస్తున్న సాంకేతికతలను ధ్రువీకరించడానికి వ్యోమమిత్ర రోబోతో కూడిన మొదటి మానవ రహిత ప్రయోగాత్మక గగన్‌యాన్ మిషన్‌ను 2026 నాలుగో త్రైమాసికంలో లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారుభారత మొదటి మానవ సహిత అంతరిక్ష ప్రయోగానికి ముందుమొదటి మానవ సహిత ఫ్లైట్ నిర్మాణ ఆకృతిలోనే మరో రెండు అదనపు మానవ రహిత మిషన్లను 2027 నాటికి నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు

మానవ అంతరిక్ష పరిశోధనకు సంబంధించిన భారత దీర్ఘకాలిక ప్రణాళికను వివరిస్తూ,  2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రం (బీఏఎస్)ను కార్యాచరణలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారుఈ అంతరిక్ష కేంద్రాన్ని అయిదు మాడ్యూళ్లతో ఏర్పాటు చేసే సమగ్ర నమూనాను ఇస్రో రూపొందించిందనిఇందులో తొలి మాడ్యూల్  బీఏఎస్–01 అభివృద్ధిప్రయోగానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వెల్లడించారుబీఏఎస్–01 మాడ్యూల్‌కు సంబంధించిన సమగ్ర వ్యవస్థ రూపకల్పనసాంకేతిక అభివృద్ధి పనులు ఇస్రోకు చెందిన వివిధ కేంద్రాలూవిభాగాల్లో పురోగతిలో ఉన్నాయని తెలిపారు.

మానవ అంతరిక్ష యాత్ర కార్యక్రమం కింద చేపట్టనున్న ఎనిమిది మిషన్ల అమలు కోసం రూ.20,193 కోట్ల నిధులను 2024 సెప్టెంబరులో కేంద్ర మంత్రివర్గం ఆమోదించినట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.

గగన్‌యాన్ కార్యక్రమం కోసం ప్రముఖ అంతర్జాతీయ అంతరిక్ష సంస్థలతో ఇస్రో కీలక భాగస్వామ్యాలు ఏర్పరుచుకున్నట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారునెట్‌వర్క్ కార్యకలాపాల కోసం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ), వ్యోమగాములుక్రూ మాడ్యూల్ రికవరీ కోసం ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ (ఏఎస్ఏ), ఫ్లైట్ సర్జన్లుగ్రౌండ్ సపోర్ట్ బృందాలకు ప్రత్యేక శిక్షణ కోసం ఫ్రాన్స్‌కు చెందిన సీఎన్ఈఎస్వ్యోమగాముల శిక్షణమానవ అంతరిక్ష యాత్రకు అవసరమైన కీలక వ్యవస్థల కొనుగోలు కోసం రష్యా అంతరిక్ష సంస్థరస్ కాస్మోస్ లతో కలిసి పని చేస్తున్నట్లు వెల్లడించారు.

గగన్‌యాన్ మిషన్‌లో సాధించిన పురోగతితో పాటు భారతీయ అంతరిక్ష కేంద్రం (బీఏఎస్ఏర్పాటు కోసం రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక…స్వదేశీ మానవ అంతరిక్ష యాత్ర సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడంతో పాటు భవిష్యత్ అంతరిక్ష అన్వేషణ కార్యక్రమాలకు అవసరమైన సాంకేతిక పునాదులను నిర్మించాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనమని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.

***


(रिलीज़ आईडी: 2295760) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Gujarati