మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
దేశంలో చలామణీలో ఉన్న నకిలీ విశ్వవిద్యాలయాలు
प्रविष्टि तिथि:
05 AUG 2026 5:52PM by PIB Hyderabad
విద్య ఉమ్మడి జాబితాలో ఉంది. దేశంలో విద్యాభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తాయి. దేశంలోని నకిలీ విశ్వవిద్యాలయాల జాబితాను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఎప్పటికప్పుడు ప్రచురిస్తుంది. 2026, ఫిబ్రవరి నెలలో ప్రచురించిన తాజా జాబితా ప్రకారం, 32 నకిలీ విశ్వవిద్యాలయాలను గుర్తించారు.
నకిలీ విశ్వవిద్యాలయాల జాబితా యూజీసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది:
https://www.ugc.gov.in/universitydetails/Fakeuniversity.
నకిలీ విశ్వవిద్యాలయాలకు సంబంధించి యూజీసీ కింది చర్యలు చేపట్టింది:
-
నకిలీ సంస్థలకు వివరణ/సమ్మతి లేఖ/షో-కాజ్/హెచ్చరిక నోటీసు జారీ చేశారు.
-
అటువంటి అనధికార సంస్థల పట్ల విద్యార్థులను, ప్రజలను హెచ్చరించడానికి యూజీసీ వెబ్‌సైట్‌లో బహిరంగ ప్రకటనలు జారీ చేశారు.
-
సంబంధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, విద్యా శాఖ కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులకు లేఖలు రాశారు. అటువంటి నకిలీ విశ్వవిద్యాలయాలు, సంస్థలపై తగిన చర్యలు తీసుకోవాలనీ... యూజీసీ చట్టం-1956ను ఉల్లంఘించి పనిచేస్తున్న విద్యా సంస్థలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనీ కోరారు.
ఈ సంస్థలను మూసివేయడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. తమను తాము "విశ్వవిద్యాలయాలుగా" తప్పుగా ప్రచారం చేసుకుంటూ, డిగ్రీలు ప్రదానం చేస్తూ, తమ సంస్థ పేరులో "విశ్వవిద్యాలయం" అనే పదాన్ని వాడుతూ విద్యార్థులను మోసం చేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనా విభాగాల ప్రధాన కార్యదర్శులను కోరింది. యూజీసీ నకిలీ విశ్వవిద్యాలయాల జాబితాలో లేని... తమ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇతర నకిలీ విశ్వవిద్యాలయాల గురించి కేంద్ర ప్రభుత్వానికి, యూజీసీకి తెలియజేయాలనీ కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
ఈ సమాచారాన్ని విద్యాశాఖ సహాయ మంత్రి డాక్టర్ సుకాంత మజుందార్ ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
***
(रिलीज़ आईडी: 2295195)
आगंतुक पटल : 11