ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మహారాష్ట్రలోని సతారా జిల్లాలో అక్రమ మత్తు పదార్థాల తయారీ కేంద్రం గుట్టురట్టు చేసిన డీఆర్‌ఐ.. ఇద్దరు అరెస్టు

కిలో అల్ప్రజోలం, 15 కిలోల తయారీ దశలో ఉన్న అల్ప్రజోలం, 3.75 కిలోల డైజిపామ్ సహా

400 లీటర్ల వివిధ రకాల ముడి పదార్థాలు, రసాయన మిశ్రమాల స్వాధీనం

प्रविष्टि तिथि: 05 AUG 2026 4:54PM by PIB Hyderabad

మహారాష్ట్ర... సతారా జిల్లాలో రహస్యంగా నడుపుతున్న ఓ మాదక ద్రవ్యాల తయారీ కేంద్రంపై డీఆర్ఐ అధికారులు దాడులు చేశారుఈ ఆపరేషన్‌లో వివిధ రూపాల్లో ఉన్న సైకోట్రాపిక్ పదార్థాలతోపాటు వాటి తయారీకి ఉపయోగించే సుమారు 400 లీటర్ల ముడి సరుకును అధికారులు స్వాధీనం చేసుకున్నారుఈ వ్యవహారంలో ఇద్దరిని అరెస్టు చేశారు.

 

పక్కా సమాచారంతో 2026 ఆగస్టు 01న సతారా జిల్లాలోని తయారీ కేంద్రంపై డీఆర్ఐ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారుఎన్‌డీపీఎస్ చట్టం 1985 ప్రకారం నిషేధిత అల్ప్రజోలండైజిపామ్ ను ఇక్కడ రహస్యంగా తయారు చేస్తూ అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారుదాడుల సమయంలో తయారీదారుడిని అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు.

అధికారు తనిఖీల్లో సుమారు కిలో పూర్తిగా తయారైన అల్ప్రజోలం, 15 కిలోలకు పైగా సగం తయారైన రూపంలో ఉన్న అల్ప్రజోలంసుమారు 3.75 కిలోల డైజిపామ్ ను స్వాధీనం చేసుకున్నారువీటి తయారీకి ఉపయోగించే సుమారు 400 లీటర్ల వివిధ రకాల ముడి పదార్థాలురసాయన మిశ్రమాలను కూడా స్వాధీనం చేసుకున్నారుఈ అక్రమ సరుకంతటినీ ఎన్‌డీపీఎస్ చట్టం 1985 నిబంధనల కింద జప్తు చేశారు.

మత్తు పదార్థాలను కొనుగోలుకు సిద్ధమైన ఓ వ్యక్తిని పూణేలో అదుపులోకి తీసుకున్నారునిందితుల అక్రమ లావాదేవీలకు సంబంధించిన కీలక ఆధారాలను అధికారులు సేకరించారు.

అల్ప్రజోలండైజిపామ్ లు బెంజోడయాజెపైన్ వర్గానికి చెందినవిఆందోళనపానిక్ అటాక్‌నిద్రలేమిమూర్ఛఇతర నాడీ సంబంధిత సమస్యల చికిత్సకు వైద్యుల పర్యవేక్షణలో వీటిని ఉపయోగిస్తారుమత్తును కలిగించే గుణంబానిసగా మార్చే స్వభావం కలిగి ఉండటం వల్ల ఎన్‌డీపీఎస్ చట్టం 1985 కింద నియంత్రించారువీటిని అక్రమంగా తయారు చేయడంరవాణా చేయడం ప్రజా ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారుతుందివీటి దుర్వినియోగం వల్ల మత్తుకు బానిస కావడంమెదడు దెబ్బతినడం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

నిందితులు గతంలోనూ ఇలాంటి అక్రమ మాదకద్రవ్యాల తయారీరవాణా కార్యకలాపాలలో పాల్గొన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందిఎన్‌డీపీఎస్ చట్టం 1985 నిబంధనల ప్రకారం ఇద్దరు నిందితులను అధికారులు అరెస్టు చేశారు.

 

***


(रिलीज़ आईडी: 2295191) आगंतुक पटल : 2
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Gujarati , Urdu , हिन्दी , Marathi