సహకార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సహకార ఆధారిత సేంద్రీయ వ్యవసాయం

प्रविष्टि तिथि: 04 AUG 2026 5:15PM by PIB Hyderabad

కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ 2015–16 నుంచి అస్సాంతో సహా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేస్తున్న పరంపరాగత్ కృషి వికాస్ యోజన (పీకేవీవై) ద్వారా సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. అదే ఏడాది నుంచి అస్సాంతో సహా ఈశాన్య రాష్ట్రాల్లో అమలవుతున్న మిషన్ ఆర్గానిక్ వాల్యూ చెయిన్ డెవలప్మెంట్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ (ఎంవోవీసీడీఎన్ఈఆర్) ద్వారా కూడా సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది.

దిగుబడి నుంచి శుద్ధి వరకు, ధ్రువీకరణ నుంచి మార్కెటింగ్ వరకు సేంద్రీయ వ్యవసాయంలో నిమగ్నమైన రైతులకు పూర్తిస్థాయి మద్దతును అందించడంపై రెండు పథకాలు దృష్టి సారిస్తాయి. చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యమిస్తూ, సరఫరా వ్యవస్థలను సిద్ధం చేసేలా ఆర్గానిక్ క్లస్టర్లను ఏర్పాటు చేయడమే ఈ పథకాల ప్రధాన లక్ష్యం. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రభుత్వాల ద్వారా ఈ రెండు పథకాలు అమలవుతున్నాయి. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు పీకేవీవై ద్వారా హెక్టారుకు రూ.31,500 చొప్పున ఆర్థిక సాయం మూడేళ్ల కాలవ్యవధిలో అందుతుంది. దీనిలో పొలంలో/పొలం వెలుపల సేంద్రీయ ఉత్పాదకాల కోసం హెక్టారుకు రూ.15,000 చొప్పున ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా రైతులకు నేరుగా అందుతుంది.

రైతు ఉత్పాదక సంస్థల ఏర్పాటు, సేంద్రీయ ఉత్పాదకాల విషయంలో రైతులకు తోడ్పాటు, మొదలైన వాటి కోసం ఎంవోవీసీడీఎన్ఈఆర్ ద్వారా మూడేళ్ల కాలవ్యవధిలో హెక్టారుకు రూ.46,500 చొప్పున సాయం లభిస్తుంది. ఇందులో భాగంగా పొలంలో/ పొలం వెలుపల సేంద్రీయ ఉత్పాదకాల కోసం హెక్టారుకు రూ.32,500 చొప్పున సాయం అందుతుంది. ఈ మొత్తంలో రైతులకు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా అందించే రూ.15,000 కూడా ఉంటాయి.

ఈ సమాచారాన్ని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంగా అందించారు.

 

***


(रिलीज़ आईडी: 2294703) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Punjabi