వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పీఎంఎఫ్‌బీవై కింద వర్తించే నష్టభయాలు, విపత్తులు

నాడు పోస్టు చేయడమైనది: 04 AUG 2026 6:15PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) 2016-17 నుంచి దేశంలో ప్రారంభమైందిరాష్ట్రాలురైతులు దీనిని స్వచ్ఛందంగా ఎంచుకోవచ్చుసంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిన పంటలుప్రాంతాలకు విత్తనాలు వేసే ముందు దశ నుంచి పంట కోత అనంతర దశ వరకు నిరోధించలేని సహజ విపత్తుల వల్ల జరిగే పంట నష్టానికి ఈ పథకం సమగ్ర బీమా రక్షణను అందిస్తుందిఅడవి జంతువుల వల్ల జరిగే పంట నష్టాలు నిరోధించే అవకాశం ఉండటంతో మొదట్లో వీటిని ఈ పథకంలో చేర్చలేదుపర్యావరణఅటవీవాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖరాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వాల సొంత ఖర్చుతో ‘యాడ్-ఆన్ కవర్’ రూపంలో వ్యక్తిగత అంచనా ఆధారంగా అడవి జంతువుల వల్ల జరిగే నష్టాలను కూడా తెలియజేయటానికి రాష్ట్రాలకు అనుమతి ఇచ్చారుదీనికి సంబంధించిన వివరణాత్మక నిబంధనలునియమాలను ఈ పథకానికి సంబంధించిన నిర్వహణ మార్గదర్శకాలలో పొందుపరిచారు.

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవైకింద నోటిఫై చేసిన అన్ని పంటలకు వరదలునీటిలో మునక వల్ల కలిగే నష్టానికి బీమా రక్షణ అందుబాటులో ఉంటుందిఅయితే వరిజనుముమేస్తాచెరకు వంటి నీటిని ఎక్కువగా తట్టుకునే లేదా నీటిలో పెరిగే పంటలకు స్థానిక ప్రాంతాల అంచనాపరిమిత ప్రాంతాల క్లెయిమ్‌ల మినహా సాధారణ బీమా రక్షణ వర్తిస్తుంది.

ఈ సమాచారాన్ని కేంద్ర వ్యవసాయరైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ రామ్‌నాథ్ ఠాకూర్ ఈ రోజు లోక్‌సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం రూపంలో వెల్లడించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2294676) సందర్శకుల సూచీ సంఖ్య : : 32
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Punjabi , Tamil