గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
వీబీ-జీ రామ్-జీ కింద శాశ్వత ఉపాధి
प्रविष्टि तिथि:
04 AUG 2026 4:25PM by PIB Hyderabad
వికసిత్ భారత్ – రోజ్‌గార్, ఆజీవికా గ్యారంటీ మిషన్ (గ్రామీణ్) (వీబీ-జీ రామ్-జీ) చట్టం-2025 అమలు ద్వారా ఈ పథకం 01.07.2026 నుంచి దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతంగా అమలవుతోంది. మహాత్మా గాంధీ ఎన్‌ఆర్‌ఇజిఎస్ కింద లభించే వంద రోజుల గ్యారంటీడ్ వేతన ఉపాధికి బదులుగా... వీబీ-జీ రామ్-జీ పథకం ద్వారా నైపుణ్యంతో సంబంధం లేని శారీరక శ్రమ చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వయోజన సభ్యులు గల ప్రతి గ్రామీణ కుటుంబానికి ఒక ఆర్థిక సంవత్సరంలో నూట ఇరవై ఐదు రోజుల వేతన ఉపాధికి చట్టబద్ధమైన హామీ లభిస్తుంది. ఈ కొత్త పథకం 01.07.2026 నుంచి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతోంది.
దీని కోసం మహారాష్ట్రకు రూ.4420.32 కోట్ల మధ్యంతర కేటాయింపులు చేశారు. ఆ రాష్ట్రం నుంచి అందిన ప్రతిపాదనల ఆధారంగా, వివిధ విభాగాల కింద కేంద్ర వాటాగా మహారాష్ట్రకు రూ.1459.92 కోట్ల తొలి విడత నిధులనూ మంజూరు చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికీ మొదట రూ.6252.03 కోట్ల మధ్యంతర కేటాయింపులు జరిగాయి. ఆ రాష్ట్రం నుంచి అందిన ప్రతిపాదనల ఆధారంగా, వివిధ విభాగాల కింద కేంద్ర వాటాగా ఆ రాష్ట్రానికి రూ.630.76 కోట్ల తొలి విడత నిధులూ మంజూరు చేశారు.
చట్టంలోని సెక్షన్ 5(4) ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం కింద హామీ ఇచ్చిన కాలానికి మించి అదనపు ఉపాధి దినాలను తమ సొంత వనరుల నుంచి అందించేలా నిబంధనలు రూపొందించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ చట్టంలోని షెడ్యూల్ Iలో పేర్కొన్న నీటి సంబంధిత పనులు, కీలక గ్రామీణ మౌలిక సదుపాయాలు, జీవనోపాధి సంబంధిత మౌలిక సదుపాయాలు, తీవ్రమైన వాతావరణ సంబంధిత సంఘటనలను తగ్గించే ప్రత్యేక పనులు మొదలైన అనుమతించదగిన పనులను అమలు చేయడం, మన్నికైన ఆస్తులను సృష్టించడం ద్వారా సుస్థిర గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేయడం ఈ చట్టం లక్ష్యం. ఈ నిబంధనలు జీవనోపాధి భద్రతను పెంచడానికి, గ్రామీణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, స్థిరమైన గ్రామీణాభివృద్ధిని ప్రోత్సహించడానికి ఉద్దేశించినవి.
గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పేదరిక నిర్మూలన కార్యక్రమం దీన్‌దయాల్ అంత్యోదయ యోజన–జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (డీఏవై-ఎన్ఆర్ఎల్ఎమ్)... మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సహా 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 760 జిల్లాలు, 7246 మండలాల్లో రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్ల ఆధ్వర్యంలో అమలవుతోంది. జూన్ 2026 నాటికి, ఈ మిషన్ సుమారు 10.08 కోట్ల గ్రామీణ కుటుంబాలను సమీకరించి, దాదాపు 92 లక్షల స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసింది. డీఏవై-ఎన్ఆర్ఎల్ఎమ్ ప్రస్తుత నిబంధనల ప్రకారం... అర్హత కలిగిన స్వయం సహాయక బృందాలకు ఆదాయాన్నిచ్చే, జీవనోపాధి కల్పించే కార్యకలాపాలు, వ్యవస్థాపక ప్రయత్నాల కోసం అవసరమైన మద్దతు అందిస్తున్నారు. ప్రతి స్వయంసహాయక బృందానికి రూ.20,000–రూ.30,000 రివాల్వింగ్ ఫండ్ రూపంలోనూ, రూ. 2.50 లక్షల వరకు కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (సీఐఎఫ్) రూపంలోనూ మూలధన మద్దతు అందిస్తున్నారు.
అదనంగా, అర్హత కలిగిన స్వయం సహాయక బృందాలకు ఇచ్చే బ్యాంకు రుణాలపై వడ్డీ రాయితీ అందుబాటులో ఉంది. రూ.3 లక్షల వరకు రుణాలకు, సంవత్సరానికి 7 శాతం రాయితీ వడ్డీ రేటుతో బ్యాంకులు రుణాలు అందిస్తాయి. రూ.3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు రుణాల కోసం... బ్యాంకులు తమ ఒక సంవత్సరం ఎంసీఎల్ఆర్‌కు సమానమైన వడ్డీ రేటుకు గానీ, లేదా ఏదైనా ఇతర బాహ్య బెంచ్‌మార్క్ ఆధారిత రుణ రేటుకు గానీ, లేదా సంవత్సరానికి 10 శాతానికి గానీ, ఈ మూడింటిలో ఏది తక్కువైతే ఆ వడ్డీ రేటుకు రుణాలను అందిస్తాయి. ఈ మిషన్ కింద స్వయం సహాయక బృందాలకు ఇప్పటివరకు రూ.13.41 లక్షల కోట్ల రుణాలు పంపిణీ చేశారు. ఈ పథకం మార్గదర్శకాలకు అనుగుణంగా... మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోని స్వయం సహాయక బృందాలు సహా, అర్హత కలిగిన స్వయం సహాయక బృందాలకు ఈ ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.
ఈ సమాచారాన్ని గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీ కమలేష్ పాశ్వాన్ ఈ రోజు లోక్‌సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
***
(रिलीज़ आईडी: 2294374)
आगंतुक पटल : 10