బొగ్గు మంత్రిత్వ శాఖ
జులైలో క్యాప్టివ్, వాణిజ్య గనుల్లో నెలవారీ ఉత్పత్తి, రవాణాలో కొనసాగిన వృద్ధి
प्रविष्टि तिथि:
03 AUG 2026 12:21PM by PIB Hyderabad
క్యాప్టివ్, వాణిజ్య బొగ్గు గనుల రంగం తన బలమైన వృద్ధిని కొనసాగిస్తూ.. 2026 జులైలో అధిక ఉత్పత్తిని సాధించింది. తద్వారా భారత బొగ్గు రంగంలో పెరుగుతున్న తన పాత్రను బలోపేతం చేస్తోంది. ఈ నెలలో క్యాప్టివ్, వాణిజ్య గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి 14.78 మిలియన్ టన్నులకు (ఎంటీ) చేరుకుంది. అదే సమయంలో బొగ్గు రవాణా 17.49 ఎంటీలకు చేరుకుంది. 2025 జులైతో పోలిస్తే.. బొగ్గు ఉత్పత్తిలో 9.61 శాతం వార్షిక వృద్ధి నమోదయింది. ఇది మైనింగ్ కార్యకలాపాల్లో సాధిస్తున్న స్థిరమైన వృద్ధినీ, దేశీయ బొగ్గు ఉత్పత్తిలో పెరుగుతున్న ఈ గనుల వాటాను ప్రతిబింబిస్తోంది.
క్యాప్టివ్, వాణిజ్య బొగ్గు మైనింగ్ రంగంలో కార్యాచరణ సామర్థ్యంలో నిరంతరం సాధిస్తున్న మెరుగుదలను, మైనింగ్ ఉత్పాదకత పెంపును, మైనింగ్ సామర్థ్యాల సమర్థ వినియోగాన్ని ఈ ప్రోత్సాహకరమైన పనితీరు వివరిస్తుంది.
దిగువన ఉన్న గ్రాఫు నెలలో ఉత్పత్తి, రవాణా (మిలియన్ టన్నుల్లో) పనితీరును వివరిస్తుంది

క్యాప్టివ్, వాణిజ్య గనుల్లో పెరిగిన సుస్థిరమైన ఉత్పత్తి.. బొగ్గు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందనీ, సరఫరా వ్యవస్థల స్థిరత్వాన్ని బలోపేతం చేస్తుందనీ, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేస్తుందనీ అంచనా వేస్తున్నారు. అలాగే దేశ ఇంధన భద్రత, పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన కీలక ముడి పదార్థంలో స్వయం సమృద్ధిని పెంచడం ద్వారా ఆత్మనిర్భర భారత్ దార్శనికతను ముందుకు తీసుకెళుతుందని భావిస్తున్నారు.
క్యాప్టివ్, వాణిజ్య బొగ్గు గనుల రంగం పూర్తి సామర్థ్యాన్ని వెలికి తీయడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది. ప్రగతిశీల విధాన చర్యలు, పటిష్టమైన నియంత్రణ పర్యవేక్షణ, భాగస్వాముల నిరంతర మద్దతు ద్వారా ఉత్పత్తి వృద్ధిని కొనసాగించడాన్నీ, సరఫరా సంబంధిత పరిమితులను పరిష్కరించడాన్నీ, బొగ్గు లభ్యతను మెరుగుపరచడాన్నీ కొనసాగిస్తుంది. అదే సమయంలో పెరుగుతున్న దేశ ఇంధన, వాణిజ్య అవసరాలను తీర్చడంలో ఈ రంగం విశ్వసనీయమైన సహకారం అందించేలా చూస్తోంది.
***
(रिलीज़ आईडी: 2293803)
आगंतुक पटल : 8