ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

2026 కామన్వెల్త్ గేమ్స్‌లో అద్భుతంగా రాణించిన భారత క్రీడాకారులు… ప్రధానమంత్రి హర్షం

నాడు పోస్టు చేయడమైనది: 03 AUG 2026 9:55AM by PIB Hyderabad

గ్లాస్గో 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో భారతీయ క్రీడాకారుల బృందం చూపిన ప్రతిభాపాటవాలపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.
భారత్ తరఫున 13 స్వర్ణ పతకాలతో సహా 39 పతకాలు గెలుచుకున్న క్రీడాకారులను ప్రధానమంత్రి అభినందించారు.
క్రీడలు మొదలైనప్పటి నుంచి భారతీయ క్రీడాకారులు అసాధారణ నైపుణ్యాన్నీదృఢసంకల్పాన్నీఅంకితభావాన్నీ కనబరిచారని శ్రీ మోదీ ప్రశంసించారువారి శ్రమ దేశ యువతకు స్ఫూర్తిని ఇస్తుందని ఆయన అన్నారు.
భారతీయ క్రీడాకారుల బృందం రాబోయే కాలంలో కూడా రాణించాలని కోరుకుంటూ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారువారు దేశానికి మరింత కీర్తిని సంపాదించి పెడతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని శ్రీ మోదీ పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘
గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో మన బృందం ఆటతీరు అభినందనీయం.
భారత్ 13 స్వర్ణాలు సహా 39 పతకాలను గెలవడం సంతోషదాయకంపతకాలు గెలిచిన వారికి అభినందనలు.
గేమ్స్‌లో మన ప్రతిభావంతులైన అథ్లెట్లు అసాధారణ నైపుణ్యాన్నీదృఢసంకల్పాన్నీఅంకితభావాన్నీ కనబరిచారు.
వారి శ్రమ మన యువతకు స్ఫూర్తిని అందిస్తుంది.
భారతీయ క్రీడాకారుల బృందం రాబోయే కాలంలో కూడా రాణించాలని నేను కోరుకుంటూవారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానువారు తమ అత్యుత్తమ ప్రదర్శనతో దేశానికి మరింత కీర్తిని సంపాదించిపెట్టాలని అభిలషిస్తున్నాను.’’

 

***


(రిలీజ్ ఐడి: 2293728) సందర్శకుల సూచీ సంఖ్య : : 57