ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కామన్‌వెల్త్‌ గేమ్స్‌ పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌57 విభాగంలో స్వర్ణ పతక విజేత సోమన్‌ రాణాకు ప్రధానమంత్రి అభినందనలు

प्रविष्टि तिथि: 02 AUG 2026 12:53AM by PIB Hyderabad

   గ్లాస్గో కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2026 పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌57 విభాగంలో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న సోమన్‌ రాణాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

అసాధారణ విజయంతో ఈ విభాగంలో భారత్‌కు తొలి కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతకాన్ని సోమన్ రాణా సముపార్జించి పెట్టాడని ప్రధానమంత్రి అన్నారు.

ఈ పోటీలో ఆద్యంతం ఏకాగ్రత, అకుంఠిత దీక్షతో తన సంకల్పం సాకారం చేసుకున్నాడని శ్రీ మోదీ ప్రశంసించారు. భవిష్యత్తులోనూ ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ (ట్విట్టర్) ద్వారా పంపిన సందేశంలో:

“సోమన్‌ రాణా సరికొత్త చరిత్ర సృష్టించాడు...

కామన్వెల్త్ గేమ్స్‌ పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌57 విభాగంలో స్వర్ణ పతకం సాధించినందుకు అతనికి నా హృదయపూర్వక అభినందనలు. ఇది నిస్సందేహంగా అసాధారణ విజయం. రాణా ప్రతిభా ప్రదర్శనతో ఈ విభాగంలో భారత్‌కు తొలి కామన్వెల్త్ స్వర్ణాన్ని సాధించిపెట్టాడు. ఈ క్రమంలో ఆద్యంతం అతడు చూపిన పట్టుదల, ఏకాగ్రత, దృఢ సంకల్పం ప్రస్ఫుటమయ్యాయి. భవిష్యత్తులోనూ అతడు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.




****************


MJPS/SS/ST


(रिलीज़ आईडी: 2293251) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Gujarati , Tamil , Kannada , Malayalam