ప్రధాన మంత్రి కార్యాలయం
కామన్‌వెల్త్ మహిళల బాక్సింగ్ 57 కిలోల విభాగంలో స్వర్ణం సాధించిన జాస్మిన్ లాంబోరియాకు ప్రధానమంత్రి అభినందన
నాడు పోస్టు చేయడమైనది:
02 AUG 2026 12:45AM by PIB Hyderabad
గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్-2026 మహిళల బాక్సింగ్ 57 కిలోల విభాగంలో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న జాస్మిన్ లాంబోరియాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
బాక్సింగ్ క్రీడపై అంకితభావం, ప్రతిభా ప్రదర్శనలో స్థిరత్వం ఆమె సాధించిన ఈ విజయాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
భవిష్యత్తులోనూ ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా పంపిన సందేశంలో:
“గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ మహిళల బాక్సింగ్ 57 కిలోల విభాగంలో స్వర్ణపతక విజేత జాస్మిన్ లాంబోరియాకు అభినందనలు. ఈ విజయంలో ఆమె అంకితభావం, స్థిరత్వం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమెకు నా శుభాకాంక్షలు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***************
MJPS/SS/ST
(రిలీజ్ ఐడి: 2293247)
సందర్శకుల సూచీ సంఖ్య : : 49
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam