ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పురుషుల ట్రిపుల్ జంప్‌లో రజతం గెలుచుకున్న ప్రవీణ్ చిత్రవేల్‌ను అభినందించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 02 AUG 2026 12:47AM by PIB Hyderabad

గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్-2026 పురుషుల ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో రజత పతకం గెలుచుకున్న ప్రవీణ్ చిత్రవేల్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

ప్రవీణ్ చిత్రవేల్ తన క్రీడా జీవితంలోనే అత్యుత్తమ జంప్‌ను నమోదు చేయడం పట్ల ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.

ఈ ఘనత సాధించిన సందర్భంగా చిత్రవేల్‌ను అభినందించిన శ్రీ మోదీభవిష్యత్ ప్రయత్నాలన్నింటిలోనూ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

కామన్వెల్త్ క్రీడలు-2026 పురుషుల ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో ప్రవీణ్ చిత్రవేల్ రజత పతకం గెలుచుకోవడంతన క్రీడా జీవితంలోనే అత్యుత్తమ జంప్‌ను నమోదు చేయడం చాలా సంతోషంగా ఉందిఅతనికి అభినందనలుఅతని భవిష్యత్ ప్రయాణంలో అన్ని ప్రయత్నాల్లోనూ విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా.

 



**************


MJPS/SS/ST


(रिलीज़ आईडी: 2293241) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Gujarati , Tamil , Kannada , Malayalam