ప్రధాన మంత్రి కార్యాలయం
కామన్వెల్త్ గేమ్స్-2026 మహిళల 54 కేజీల బాక్సింగ్‌లో స్వర్ణం గెలిచిన ప్రీతిని అభినందించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
02 AUG 2026 12:43AM by PIB Hyderabad
కామన్వెల్త్ గేమ్స్-2026 మహిళల 54 కేజీల బాక్సింగ్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్న ప్రీతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
ప్రీతి నిలకడైన ఆటతీరుతో అద్భుత ప్రదర్శన కనబరుస్తోందని ప్రధానమంత్రి ప్రశంసించారు.
ఈ ఘనత సాధించిన సందర్భంగా ప్రీతిని అభినందించిన శ్రీ మోదీ, రాబోయే సంవత్సరాల్లో ఆమె మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“54 కేజీల మహిళల బాక్సింగ్ ఈవెంట్‌లో స్వర్ణం గెలుచుకున్న ప్రీతి అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఆమె ఆటతీరు నిలకడగా ఉంది. ఆమెకు అభినందనలు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా”.
***************
MJPS/SS/ST
(రిలీజ్ ఐడి: 2293240)
సందర్శకుల సూచీ సంఖ్య : : 53
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Kannada
,
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam