ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహిళల 51 కేజీల బాక్సింగ్‌లో స్వర్ణం గెలిచిన సాక్షిని అభినందించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 02 AUG 2026 12:54AM by PIB Hyderabad

గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌-2026 మహిళల 51 కేజీల బాక్సింగ్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్న సాక్షికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

సాక్షి అద్భుతమైన ప్రదర్శననునిర్ణయాత్మక విజయాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు.

సాక్షి నిరంతర విజయాన్ని ఆకాంక్షించిన శ్రీ మోదీభవిష్యత్తులో ఆమె మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎక్స్’ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

మహిళల 51 కేజీల బాక్సింగ్ ఈవెంట్‌లో సాక్షి ప్రతిష్ఠాత్మక స్వర్ణ పతకం గెలుచుకున్నారుఅద్భుతమైన ప్రదర్శనతోనిర్ణయాత్మక విజయం సాధించినందుకు ఆమెకు అభినందనలుసాక్షి మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నా!




**********


MJPS/SS/ST


(రిలీజ్ ఐడి: 2293238) సందర్శకుల సూచీ సంఖ్య : : 38